Friday, October 5, 2012

ఓ దేవుడా ఈ సమంత ని ఒకసారి చూడవయా ...
లోకాన మాయ చేసే నీకూ మాయే చేస్తుంది
అపుదనిపిస్తుంది నీకూ నాలా ....

తన కన్నులపై కనుపాపనై పోనా..
లేక తన అదరాన మాటనై పోనా ..
లేక తను పీల్చే శ్వాసనై పోనా ..
ఇంకాస్త చోటిస్తే ఆ మనసులో బావాన్నైఒదిగి పోనా....

ఏ మయ్యా..
ఏందయ్యా ....
ఈ మాయే0దయ్యా .... ..... .
ఏదో ఒక మాయ నిజంగానే చేస్తుంది కదా ...:) ;) :P :D

Wednesday, September 26, 2012


సాయం కోరావని నువ్వు చేతకానివాడివి కాదు ...
సాయం చేసావని గొప్పవాడివి కావు ...
సాయంని సహాయాన్ని ఎటుచూసినా ఒకేలా ఉండాలి .. 
అదేవిదంగా ప్రేమని ప్రేమించడం ప్రేమించ బడటం కూడా అంతే ...
చూపించగలిగేదే ఐతే చూపేలేని వాళ్లకి ప్రేమే దొరకదు కదా ... !!

Thursday, September 13, 2012

నాకేమీ తెలియటం లేదు ....
నీవున్నా నాకు లేవనే వినిపిస్తోంది ..
నాలో ఉన్న ప్రేమని మౌనంగా దాచుకొన్నా ....
నా హృదయం అద్దం వలె నీ ప్రతిబింబాన్ని చూపిస్తోంది ...
లేదనే నీ సమాధానం తో దాన్ని ముక్కలు చేస్తావా .... 
నా పై ప్రేమ లేదని నీకు చెపాలంటే ఒక క్షణం చాలు  ....
కాని నా ప్రేమను నిరూపించాలంటే నిండు నూరేల్లైనా చాలవే ..
నీ బదులు లేదు అని అంటే ...
నాకు మరో జన్మైనా కావాలి నీ దరి చేరేదాకా  .... !!





Wednesday, September 5, 2012

ఊ అంటే నిజమౌతా ....
కాదంటే కలనౌతా....
నిన్నలోనే నిలుచున్న జ్ఞాపకం కన్నా ...
నేటిలోని నిజం ని తలుచుకున్నా ..
కలలతోనే కాలయాపన చేసినా ...
నిజాల జాడలో నీవే అని మనసెరిగి మెలకువలో కలే నే చూసినా .....
కేవలం నీ ధ్యాసలో .... 
కేవలం నా మనసులో ..... !!

Tuesday, September 4, 2012

నా మదిలోమౌనంతో  నే పడిన సంఘర్షణ కి ....
తొలి మాట నేర్పిన నా మొదటి గురువు నా తల్లి కి వందనం  ......
ఆశలతో నా విహారానికి తన చేతినిచ్చి ....
తొలి అడుగు కి ఆసరా ఇచ్చిన నా కన్న తండ్రికి అభివందనం .....
రోజులెంత శూన్యంగా కనిపించినా ....
తన దాగుడు మూతలతో నాకు దారి చూపించిన ఆ సర్వాంతర్యామికి సుమాంజలి ...

లోకమంతా కొత్తగా కొంగొత్తగా, ప్రతి చిన్న విషయం వింతగా తోచిన వేళ .....
హృదయం చాచి ఆదరిస్తున్న  కుటుంబ అనురాగ బంధానికి కుసుమాంజలి  .....

ఊసులే లేని నా జీవితాన తన చూపులతో, అల్లరి చేష్టలతో  ....
నా జీవితానికి ఊపిరి అందించిన నా ప్రియ నేస్తానికి నమసుమాంజలి ......
ఆశల కెరటాలతో జీవితమనే సంద్రంలో అలలా ఎగిసిపడుతున్న నాకు ....
ఎదురీతనే నేర్పించి ఓ చుట్టపు చూపులా నను ఆ దరికి చేర్చిన నా గురువులందరికి పాదాభివందనం ....
వారందరికీ ఈ రోజున అక్షరాలతో  నేను చేస్తున్న అభిషేకం ....... !!




Sunday, August 5, 2012

మనసుకి నచ్చిన వ్యక్తి మాట్లాడే ఒక్క నిముషం మాటల కోసం లక్షల నిముషాలు ఆనందంగా ఎదురు చూస్తున్నట్టు ....
క్షణమైనా తీరికనే ఉండని ఈ జీవితంలో ప్రతి క్షణం కోరికలున్నట్టు ....
క్షణమైనా వేచి ఉండని కరుణలేని సమయానికి తోడేవరు లేనట్టు ....
పోవద్దె ప్రాణమా అని ఎంత మొత్తుకున్నామరణం వస్తే ఆగనట్టు  ...
క్షణం, ప్రాణం ఆగకపోయినా ....
తిరిగిరాని కాలానికి, అలసిపోయే ప్రాణానికి  ...
మరువలేని మధుర జ్ఞాపకాలతో తిరిగి రప్పించే దేవుడిచ్చిన ఓ గొప్ప వరం .... స్నేహం ....
సూర్య కిరణానికి చీకటే  తెలియనట్టు ...
జీవన పద్మవ్యూహంలో దారులు చూపే దివ్య కిరణం లాంటి స్నేహానికి అడ్డేమి .....
వెలుగు జిలుగుల లోకానికి మారు రూపమయిన ఓ స్నేహ బంధమా  .....
ఆనందానికి చిరునామా ...
ఔన్నత్యం కోరే ఓ గొప్ప బంధమా...
విడిపోని నీడలా తోడుండేది  ...
సమస్యలలో భుజం తట్టేది ....
సమస్త కాలంలో మన వెంటుడేది ...
చిరస్తాయిగా నిలిచే విలువైన మాధుర్య బంధం ...
కల్మషం లేని స్నేహంతో జీవితమంతా పూలబాటే కదా ..... !!







Saturday, August 4, 2012

నీవు చూసే చూపు కోసం కనులు తెరిచిన నా మనసు ....
నా లోలోపల నీకై  పరుగులు తీసేది ...
అలసిపోయాను ...
నను నేను  మైమరిచిపోయాను ...
నాలో మైమరిచిన  నీ రూపు జాడే తెలియక తికమక పడిపోయాను ...
నీవు ఎపుడైనా నా దరికి వస్తావని ఇలా ఒంటరిగా ఈ దరిలో నీకోసం వేచి ఉన్నాను ....

Wednesday, July 18, 2012

ఓ ప్రేమా ....
కల కన్నంతనే  మెలకువతో ముగింపు లేనంతగా కరిగిపోయే కలలా ....
నిస్వార్థంగా  నింగి నుంచి జారే చినుకుతో చినబోని ఆ మబ్బులా ...
మనసంతా కలవర మయ్యేలా ఉన్నా ....
క్షణం తీరిక లేకుండా,
ఆలోచనలనే ఆపలేక,
మనసుని మార్చలేక ,
నా ఊహలకి పగలే రెక్క లొచ్చినా ....
నా చూపులకు కళ్ళెం వేస్తున్న నీ చూపులని దాచుకోవాలని   .....
నీ మనసులో ఏ మాయో చేయాలని అనుకున్నంతనే  ....
అడుగుల్లో పరుగులు గుర్తొచాయి .....
ఉన్నటుండి మబ్బుల్లో మెరుపు వచ్చినట్టు ....
మాటల్లో వణుకులు పుట్టు కొచ్చాయి ....
మనసంతా అల్లకల్లోలమై .....
మూగబోయిన నా ముందు నీవు ఎదురయ్యే క్షణం .......
ఎడారిలో ఒయాసిస్సుని చూసినంతలా ....
చుక్కల్లో నిండు జాబిలిని చూసినంతలా  ...
నా మనసు పెట్టిన పరుగులు కాస్తా అలా ఏదో మంత్రం వేసినట్టు కుదుటపడినంతలా ...
నోటి చివరన మాట కాస్తా గుండెల్లో చేరి ప్రేమలా అయిందిలా ......






Monday, July 16, 2012

నా మాటలో  నీ పేరే మంత్రంలా వినిపిస్తోంది ....
నాతో  పాటు నడిచోచే నీ రాకనే మరిచి ....
నా వయసు కాలంతో పరుగులు పెడుతోంది .... 
జాలి లేని ఈ మేఘమెలా కటినంగా ఉందో ....
ఆ మేఘమెపుడైనా కరగదా అని జాలి గా చూసే ఆ చకోర పక్షే నాకాదర్శమవదా  ....
తొలి తొలి వలపుల తొలి తొలి చూపులని నీవు మరిచినా  ...
నను విడిపోయినా అనుక్షణం నను కదిపే నా కన్నీళ్ళ లో నీ  రూపం చెదిరిపోకుండా దాచుకుంటాను .....
ఆ చోటా ఈ చోటా అని వెతకడం తోనే నే ఆగను ....
నా మది నిలిచిన నీవు దారి చూపిన గమ్యాన నను కలుస్తావని .....
వేచే నా మదిని నీ ప్రేమ తో కరునిస్తావని కడదాకా నే వేచి ఉండనా  ...... !!




Tuesday, June 26, 2012

ప్రేమ అనేది bubble gum లాంటిది .. మొదట్లో చాలా తీయగా ఉంటుంది ..... తరవాత  తరవాత ఎందుకు రా బాబోయ్  అనిపిస్తుంది .... కాని స్నేహం వేప పూవు లాంటిది ... మొదట్లో చాలా  చేదుగా ఉన్నా ... కాలంతో పాటుగా తీయగా అవుతుంది .....


తెలుగులో ప్రతి సినిమా కి పేర్లు మాత్రమే డిఫరెంట్ గా పడతాయి  ...కాని స్టొరీ మాత్రం ఒకటే ....
అలాగే అందరి లైఫ్ లో ప్రేమ స్టోరీస్ మాత్రమే  డిఫరెంట్ గా ఉంటాయి .... కాని ముగింపు మాత్రం  ఒకటే ....
సినిమాలో పేర్లు డిఫరెంట్ గా పడ్డాయని సినిమా బాలేక పోయినా మళ్ళీ మళ్ళీ చూడలేం కదా..
అలాగే లైఫ్ లో ప్రేమ కూడా ...
ఎపుడూ మనసు పరితపిస్తూ ఉంటుంది అని
స్నేహాన్ని వదిలేసి మరీ ప్రేమ వెంట పరుగులు తీసావా ....
అంతే ....
తకిట తకిట ....
తీరం తో కెరటం ఆటాడినట్టు ....
జీవితం తో ప్రేమ ఒక ఆటాడేస్తది ....
సినిమా లో పేర్లు సరిగా పడకపోయినా పర్లేదు సినిమా బాగుంటే చాలు ....
మనసు robbery కాకుండా ఉంటె అదే చాలు .... !!


Monday, June 11, 2012

ప్రేమ అని తలిచాను ....
తలిచిన మరు క్షణం నా నీడను సైతం నీ ద్యాసలో మరిచాను ...
నిను కలిసానని కలలే కన్నాను ...
మరి నిజంగా కలిస్తే ఆ కరిగిన కాలం లోని కల కన్నా త్వరగా కనుమరుగయ్యావు ....

అలిసిన నా మనసుకి నచ్చ చెప్పాను ...
వెంట పడి దిక్కు తెలియని దూరం చేరే కన్నా ....
కటువుగా ఉన్న కాలం కు నా మనసు తెలియ పరచాలని .....
మౌనంగా ఉన్నా  ...
ఎటుచూసినా ఎటు వెళ్ళినా
నా వైపు వచ్చే నీ జ్ఞాపకాలనీ  ....
నా మనసు అంచులలో దాచుకున్నాను పదిలంగా ....

కనిపించే ఈ లోకానికి నేను ఒంటరిని  అనిపించొచ్చు  ...
కాని నీకై నే వేచే క్షణం క్షణం ..
క్షణాలన్నీ కలిసి చివరికి నిమిషం  అయినట్టుగా ...
నీవు నేను కలిసి ప్రేమకి చిరునామా అన్నట్టుగా  అవుదామా ....
మరి నీవు నను కలిసే ఆ క్షణంని  దాచుకుంటా పదిలం గా ...
ఆ నిమిషం ఇపుడైనా కావచ్చు ... మరు జన్మకైనా ....
వేచి ఉంటాను నీకై ...
తొలి వర్షపు చినుకుకై వేచే చకోర పక్షిలా .... !!

Wednesday, May 30, 2012

 
సముద్రాన్ని చూస్తే కదిలే అలలే కనిపిస్తాయి  ..
ఆమ్మాయిని చూస్తే మెదిలే కలలే వస్తాయి ..
కానీ తీరాన్ని దాటి సముద్రం లోతుగా వెల్లామా ..
ప్రశాంతమైన నిషబ్దం ....
కానీ అమ్మాయి గుండె లోతుల్లో తొంగి చూసావా ..
అంతే 
జీవితంలో ప్రశాంతతే ఆవిరై పోతుంది ....

Saturday, May 26, 2012


ఒంటరిగా నన్ను విడిచి
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను ....

ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
చెప్పు కోవాలనుకున్న  కమ్మని ఊసుల్లోనా

అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా

వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా
నా ప్రేమకు ప్రతి రూపమా అందానికే చిరునామా ...
నిజంగా నీ కనుల సోయగం వారెవ్వా ....  !!

Wednesday, May 2, 2012

ఒంటరిగా నన్ను విడిచి
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను ....

ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
చెప్పు కోవాలనుకున్న  కమ్మని ఊసుల్లోనా

అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా

వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా
ప్రేమకు ప్రతి రూపమా అందానికే చిరునామా ...
నిజంగా నీ సోయగం వారెవ్వా ....  !!

Saturday, April 28, 2012

ప్రేమ  ... 
రెండు అక్షరాల మహా కావ్యం ... 
రెండు జీవితాలని కలిపే గొప్ప వారధి... 
ప్రేమని నిజం గా ప్రేమించండి... 
అది నమ్మకమనే పునాది మీద నిలబడే ఓ గొప్ప కట్టడం ...
ఆ పునాది ఎంత గట్టిగా ఉంటె అది అంతలా చిరకాలం నిలిచి పోతుంది ...
అలాంటి ప్రేమని పొందాలంటే  జీవితాంతం వేచి ఉండాల్సి రావోచు... 
ఎందుకంటే ప్రేమ పుట్టాలంటే ఒక క్షణం చాలు ...
ఆ ఒక క్షణం ఎపుడు వస్తుందో ఎవరూ చెపలేరు ... 
తొలి చినుకుకై వేచి ఉండే చకోర పక్షిలా నమ్మకం తో ఎదురు చూడాలి ...
ఆ నమ్మకమే నిజమైన ప్రేమ కి నిజమైన అర్హత ..... 
ఆ ప్రేమని పొందాలని కోరే ప్రతి మదికి నేను ఇచ్చే చిరు సలహా  ...
ప్రేమను ప్రేమ గా గెలవండి ....
గెలిచిన ప్రేమని నమ్మకం తో  చిరకాలం ఆస్వాదించండి ..
అదే మనిషి జీవితాన దేవుడు పంచిన అమృతం .... !!  ..

Friday, April 27, 2012

క్షణం లో పుట్టేస్తుంది ప్రేమ 
అనుక్షణం మైమరిపిస్తుంది ఈ ప్రేమ 
కాటుక కన్నుల నీ సోయగం నా మనసునే పరిచేసిందే ....
కటిక చీకట్లో వెలుగులు విరజిమ్మావే ... 
పులకించే కవ్వింతల్లో అర్థం కాని భావమేదో తడిమేస్తోంది ప్రతి క్షణం ... 
అలుపెరుగని నా ఊహల్లో పెనవేసినా ఏదో అందమైన చిరు లోకం చూపిస్తోంది .....
నీకు నను ప్రేమించే మనసుందో లేదో తెలిదు ....
కాని నా నిండు జీవితాన పున్నమి వెలుగైనావు ..... 
పున్నమి వెన్నెల్లో నిను తలిస్తే నీవు దక్కుతావో ఏమో అని .....
అది నిజం కాక పోయినా అమాయకం గా అర్థం లేని చేష్టలు చేస్తునా ...
గుండెల్లో గాయమైనా ఏమైనా ఈ మాయేనా ప్రేమంటే ... ????


Thursday, April 12, 2012

ప్రేమని ప్రేమగా ప్రేమించే క్షణాల కోసం ....
వేగంగా సాగే జీవితాన వేచి ఉన్నా ...
ఆ క్షణాలకై వేచే ప్రతి క్షణం ఎంతో బాధగా ఉన్నా ..
వేచే ప్రతి క్షణం ఆనందంగా ఉంటుందని భరిస్తూనే ఉన్నా ...
అలా ఆలోచిస్తూ గడిపిన ప్రతి క్షణం మళ్లీ రాదని తెలిసినా ....
ఆ క్షణాలన్నీ కలిపి నిమిషంగా నీతో పొందవచ్చని వేచి చూస్తున్నా ... !!

Saturday, April 7, 2012

కదలాడే ఆ కురులను సవరించే ఆ అమ్మాయి కొనవేళ్ళ కున్న వరం
చల్లగా వీచే గాలి సైతం విస్తుపోయెంతలా ఉన్న ఆ అమ్మాయి కనుల సోయగం ....
చిత్ర కారుడి కి సైతం అందని ఆ అమ్మాయి చెక్కిళ్ళ అందాలు ..
కల్ల లో మెరిసే ప్రేమ ఆ అమ్మాయి నిండైన చిరునవ్వులో అగుపిస్తోంది. ..
ఆ మోము చూస్తే ఇలాంటి పాట రావడం లో అంత ఆశ్చర్యం లేదు కదా .... :)
నిజం గా ఎంత హాయిగా ఉంది ఇవాళ ....
నిండు వేసవిలో కురిసిన ఈ ఏటి తొలకరి జల్లు ....
ఆ జల్లుల్లో తడిసిన కమ్మని మట్టి సుగంధం ...
ఆ వానలో నే తడిసిన ఆ క్షణం మధురానుభూతిని అందించింది ...
మనసంతా కొత్త కోయిలలా కొంగొత్త రాగాలు పలికిన ఆ క్షణం ...
ప్రకృతి ఒడిలో  అలా  నను నే మైమరచి పోయేలా చేసింది ....
అబ్బా  ....
అలాగే వర్షం లో తడవాలని ఉన్నా ...
ఆ మబ్బుల చాటున సూరీడుకి కూడా నాలా అనిపించినట్టుంది ....  
తను రావడం తో ఇక ఉంటా అని ఆ నీలి మబ్బులు మాయమయ్యాయి .....
మళ్లీ ఆ క్షణం ఎపుడు వస్తుందో అని వేచి ఉండక తప్పదు కదా మరి కొంత కాలం .. !!
 
 

Thursday, April 5, 2012

చూపులతో మొదలై మాటలతో చిగురిస్తే అది తొలివలపు ...
ఆ మాటలు మనసుని తాకితే అది నిజమైన ప్రేమ ...
తొలివలపు, ప్రేమల కన్నా విలువైనది స్నేహం
తొలి చూపులతోనో  లేక మాటలతోనో మొదలవదు ...
అది దేవుడిచ్చిన గొప్ప వరం ....
దానికి టైం వస్తే ఎలాగైనా అది మొదలవుతుంది ....
అంతే ... !!
 

Tuesday, March 27, 2012

ఓహో...

ఓ అందమైన మరో ప్రపంచం ...
తెల తెలవారుతున్న సమయం ...

కోయిల స్వరాల కమ్మని సంగీతం ..
ఆహా..  వింటుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది  ...

ఎదురుగా జాలువారే జలపాతం ...
ఆహా ... చూస్తుంటే మనసంతా కోలాహలంగా ఉంది  ...

ఔను ... హరివిల్లు, జలపాతాల అద్బుత సంగమం ....

ఆహా ...
చాలు ఈ జీవితం ... ఎంతో నయనానందకరం నా కన్నులకు అనుకున్నా ...

జిగ్ జిగ్ బిగ్ బిగ్  జిగ్ జిగ్ ...
రివర్స్ ,... అంతా రివర్స్ ......

ఔను ....
ఇంతలో ఎవరో తట్టినట్టు ఐంది నా భుజాన్ని ...
ఉలిక్కి పడి కన్నులు తెరిచాను  ....
అబ్బా ....
చూడ చక్కని ఆ దృశ్యం .....
కలనా .... ???

ఔను నిజం గా కలనే ...
ఎందుకంటే ఉన్నది ఆఫీసులో ... నా క్యూబ్ లో ..... :(




Thursday, March 22, 2012

ఆమని అందాలు అపార్ట్మెంట్ల మధ్యన చిన్నబోతునాయి ...
పచని చెట్లు సినిమా సెట్ల లో చూడాల్సివస్తోంది ...
కోకిల పలుకులు కూడా కంపాక్ట్ డిస్క్ లలో  వినాల్సివస్తోంది ...
వేద మంత్రాల మాటలు సైతం సెల్లు లోనే  ...
నవ గ్రహాలూ సైతం ఔరా అనిపించే లా ఇంతకు మేమేన్ని అని డౌట్ వచ్చేలా  నవ్య ఇన్సాట్ ఉపగ్రహాల జోరు ....
ఆఖరికి బల్బుల నుండి బాంబుల వరకు అన్నీ రిమోట్ల తోనే ....
నాయకుడు రాజకీయం చేస్తునాడు ....
స్వాములు కూడా స్కాములు  చేస్తునారు .....
చిత్ర విచిత్రం గా ఉంది ప్రపంచం ....
మరి ఉగాది అంటే .....
ఒక పండగ ....
అంతే ...
ఒక హాలిడే .....

ఓ దేవుడా ...
మా మంచి దేవుడా...
చేసుకోడానికి పండగనిచ్చావు ...
చెప్పుకోడానికి  ఫేస్ బుక్కు ఇచ్చావు ..
నీవు సూపర్ .....

ఇంకా ఇంకా కొత్త కొత్త గా లోకం వెలిగి పోయేలా ..
అందరి ఇంట్లో ఆనందం విరిసేలా ....
అందరూ ఆనందం గా ఉండాలి అని కోరుకుంటున్నా ..

నందన నామ సంవత్సరం శుభాకాంక్షలు  ....

ఇట్లు
మీ శ్రేయోభిలాషి
శ్రీనివాస్ సామల  ... 




Friday, March 9, 2012

సాగే జీవిత పయనం లో చుక్కానిలా ఉండే గమ్యం .. ...
కష్టాలెదురవుతాయి రాకాసి అలలా ....
అలా అని కష్టాలే లేని ప్రయాణం అంటే కుదరదు కదా ...
రేయి వెంటే పగలు లానే  ...
ఆ కష్టాల వెంటే సంతోషం ..
నీ వెంటే నీ నీడ జతగా ఉంటుందని కూడా నమ్మకు ...
ఎందుకంటే చీకటి లో నీ నీడ నీతో ఉండదని గుర్తుంచుకో ...
ఎవరికీ ఎవరూ లేరు ...
ఎవరికీ ఎవరూ కారు ....
ప్రతి విజయాని కి ఎవరో తోడు కావాలని అంటే
అది నీ అంతరాత్మే అవాలి ...
కష్టాలెన్ని ఎదురైనా నీ చిరునవ్వే నీ ఆయుధం కావాలి ...
కరిగే ఈ కాలం మళ్లీ తిరిగి రాదనీ గుర్తుంచుకో ..... !!

Wednesday, March 7, 2012

కనులు తెరిచిన క్షణం నుంచి ...
బంధం కోసం ,
భాద్యత కోసం ,
కుటుంబం కోసం ,
అందరిని కంటి కనుపాపలా తలిచి,
ఆత్మీయతని పంచి,
తనవారి కోసం,
అహర్నిశలు కష్టించి ,
వారి కలల్ని పోషించి,
వారి భవిష్యత్ గురించి ఆలోచించి,
తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ కి పాదాభివందనం ..
ఆ స్త్రీ విలువని గుర్తించే ప్రతి ఒక్కరికి అభివందనం ...!!
ఆకాశంలో ఏడురంగుల ఇంద్ర ధనుస్సు విరిస్తే మనసులో ఆనందం ...
మరి ఆనందాల హరివిల్లు అలా ఎపుడూ ఉండాలని ఉన్నా
కాలం ఆగదు కదా...
పరుగెత్తే కాలంలో మళ్లీ వచ్చిన ఆనందాల రంగుల హొలీ ..
పద పదమని కాలం అంటున్నా
అనుభవించమని అంటున్నా ప్రతి క్షణాన్ని ..

Monday, February 27, 2012

నీ దూరం చేరాలని రెండు పట్టాల ఈ బతుకు బండిలో పరుగెడుతున్నా  ...
నాకు నీ మీదున్న ఆశలే పట్టాలై ..
సెకనుకు నీ వైపు కాంతి వేగం తో వస్తున్నా ..
నీ ఇష్టాలే నా ఇంజనై ..
బాధలనే బ్రిడ్జిలని దాటుతున్నా ...
నీకోసం ...
కేవలం నీకోసం ఓ ప్రియా ... !!

Saturday, February 11, 2012


ఒంటరిగా నన్ను విడిచి
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను

ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
కలసి తిరుగాడిన ప్రదేశాల్లోనా
చెప్పుకున్న కమ్మని ఊసుల్లోనా

అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా

వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా

కొలిచే దేవుళ్ళెందరున్నా
మదిలో కొలువైనది నువ్వే

విరబూసే పువ్వులెన్నున్నా
వాడని చిరునవ్వు నీదే

పాడే కోయిలలెన్నున్నా
వినిపించే గానం నీదే

చూసే కళ్ళు నావైనా
అవి తాకే హృదయం నీదే

చిరుగాలి తాకేది నన్నైనా
మదిలో మెదిలే తలపు నీదే

చెదిరే కలలెన్నున్నా
చెదరని రూపం నీదే

కరిగే క్షణాలెన్నున్నా
కరగని జ్ఞాపకాలు నీవే

తరిగే కాలం ముందున్నా
తరగని కన్నీళ్ళు నీవల్లే

మౌనమె నా మది భాషైనా
అందులో మాటల సందడి నీదే

నదిచే బాటలెన్నున్నా
పరిగెత్తే పయనం నీవైపే

పిలిచే పిలుపులెన్నున్నా
పిలవని తలపులు నీవే

తపించే హృదయం నాదైనా
తలపించే మధురిమ నీదే

చెరిగే గాయాలెన్నున్నా
చెరగని గురుతులు నీవే

తీసే ఊపిరి నాదైనా
అది పొసే ప్రాణం నీదే

ఆగిపోయే గుండే నాదైనా
ఆగని ప్రేమ నీపైనే

ఏడడుగులు బంధం నీతో లేకున్నా
ఏదు జన్మల అనుబంధం నీతోనే

జీవన పయనం లో దారులెన్నున్నా
అంతిమ గమ్యం నీ దరికే

Friday, February 10, 2012

నేను ప్రేమించిన ఒక అందమైన కల .. 
అది నీ రాకతో నిజం చేసావు .... 
కను చూపు మేరలో చూసాను నీ కను రెప్పల కాటుక సోయగాన్ని ... 
నీ చిరునవ్వుల చప్పుడుతో నా హృదయంలో అలజడి రేపావు  ...
నీ చూపులతో నను మైమరిపించావు ...
 నీ వాలు కనుల సోయగం తో నను మురిపించావు ...
నా మోముపై నీ చిరునవ్వులతో పూవన్నెల అందాన్నిచ్చావు .. 
ఎలా ఎలా ...
నీకు నా మనసులో మాట చెప్పేది ఎలా ..
నీవే నాలోకమని ... 
నీకోసమే నే వేచి ఉన్నా అని .. 
నీ ఎదుట నిలిస్తే నాకు మాటే రాదేలా ... 
మరి నా మనసులో మాటని నీకు తెలిపేదేలా ... 
ఎలా ఎలా ..... .. !! 






 

Saturday, February 4, 2012

కాలరాత్రిని చూసి కలత చెందకు ... 
వచ్చే ప్రశాంత సూర్యోదయం కొరకు వేచి చూడు .. 
పూవు రాలిందని కలవర పడకు .. 
వచ్చే నవ వసంతానికి స్వాగతం పలుకు .. 
కష్టాలొచ్చాయని కుంగిపోకు .. 
కష్టాలవెనకే  వచ్చే ఆనందాలకై ఎదురు చూడు .. 
క్షణాల ఈ జీవితంలో ఏ క్షణాన్ని వదులుకోకు ...
ప్రతి క్షణం ఇతరులకు నీ ప్రేమని పంచు ..  
ఎందుకంటే ఈ జీవితం ఒక పాలసముద్రం లాంటిది .. 
వచ్చే అమృతం కొరకు ఆశ తో వేచి చూడాలి .. 
ఇదే జీవితం ... 
వేచి చూడటంలోనే ఉంది అసలైన జీవిత పరమార్థం ...   !!










Friday, January 27, 2012

ప్రేమని మరిచిపోలేను ..
ప్రేమను దిగమింగను లేను .. 
అనుక్షణం ఒక తీయని నరక వేదన ..
నరకమని తెలిసినా వెలదామనుకున్నా...
కాని చెలి తలుపులు తట్టందే ఆ తలుపులు తెరుచుకోవట .. !!

Monday, January 23, 2012

లక్ష్యం ఒకటే.. కాని దారులు వేరే.. 
బాపూజీతో బంధం తెంపుకుని సొంత సైన్యానికి దళపతి అయాడు ..
'అదృశ్య' ధర్మాగ్రహమై ..
మూడు రంగుల మధ్య ధర్మ చక్రమై ..
గణతంత్రాన్నినడిపిస్తున్న, 
యువతరానికి దూకుడు మంత్రం నేర్పించిన  స్పూర్తి ప్రదాత సుభాష్ చంద్ర బోస్..
ఆయన జయంతి న ఒకసారి స్మరించుకుందాం..

Sunday, January 15, 2012

కనులకు కలలందం .. 

నీ మోముకు నవ్వందం ..
పాటకు పల్లవి అందం ...
ఆ పాటకు నీ స్వరం అందం .. 





Friday, January 13, 2012

భాగ్యాలని ఇచ్చే భోగి ...
సరదానిచ్చే సంక్రాంతి .....
పండుగకే కలనిచ్చే కనుమలోగిల్లి .. 
కొత్త సంవత్సరంలో సరికొత్తగా కొత్త వెలుగులు నింపాలని  ....
అందరికి ఆనందాన్ని పంచాలని ..
మనస్పూర్తిగా కోరుకుంటూ .. సంక్రాంతి శుభాకాంక్షలు   .. 

--  శ్రీనివాస్ సామల