నా మాటలో నీ పేరే మంత్రంలా వినిపిస్తోంది ....
నాతో పాటు నడిచోచే నీ రాకనే మరిచి ....
నా వయసు కాలంతో పరుగులు పెడుతోంది ....
జాలి లేని ఈ మేఘమెలా కటినంగా ఉందో ....
ఆ మేఘమెపుడైనా కరగదా అని జాలి గా చూసే ఆ చకోర పక్షే నాకాదర్శమవదా ....
తొలి తొలి వలపుల తొలి తొలి చూపులని నీవు మరిచినా ...
నను విడిపోయినా అనుక్షణం నను కదిపే నా కన్నీళ్ళ లో నీ రూపం చెదిరిపోకుండా దాచుకుంటాను .....
ఆ చోటా ఈ చోటా అని వెతకడం తోనే నే ఆగను ....
నా మది నిలిచిన నీవు దారి చూపిన గమ్యాన నను కలుస్తావని .....
వేచే నా మదిని నీ ప్రేమ తో కరునిస్తావని కడదాకా నే వేచి ఉండనా ...... !!
No comments:
Post a Comment