నేను ప్రేమించిన ఒక అందమైన కల ..
అది నీ రాకతో నిజం చేసావు ....
కను చూపు మేరలో చూసాను నీ కను రెప్పల కాటుక సోయగాన్ని ...
నీ చిరునవ్వుల చప్పుడుతో నా హృదయంలో అలజడి రేపావు ...
నీ చూపులతో నను మైమరిపించావు ...
నీ వాలు కనుల సోయగం తో నను మురిపించావు ...
నా మోముపై నీ చిరునవ్వులతో పూవన్నెల అందాన్నిచ్చావు ..
ఎలా ఎలా ...
నీకు నా మనసులో మాట చెప్పేది ఎలా ..
నీవే నాలోకమని ...
నీకోసమే నే వేచి ఉన్నా అని ..
నీ ఎదుట నిలిస్తే నాకు మాటే రాదేలా ...
మరి నా మనసులో మాటని నీకు తెలిపేదేలా ...
ఎలా ఎలా ..... .. !!
No comments:
Post a Comment