నీవు చూసే చూపు కోసం కనులు తెరిచిన నా మనసు ....
నా లోలోపల నీకై పరుగులు తీసేది ...
అలసిపోయాను ...
నను నేను మైమరిచిపోయాను ...
నాలో మైమరిచిన నీ రూపు జాడే తెలియక తికమక పడిపోయాను ...
నీవు ఎపుడైనా నా దరికి వస్తావని ఇలా ఒంటరిగా ఈ దరిలో నీకోసం వేచి ఉన్నాను ....
No comments:
Post a Comment