నా మదిలోమౌనంతో నే పడిన సంఘర్షణ కి ....
తొలి మాట నేర్పిన నా మొదటి గురువు నా తల్లి కి వందనం ......
ఆశలతో నా విహారానికి తన చేతినిచ్చి ....
తొలి అడుగు కి ఆసరా ఇచ్చిన నా కన్న తండ్రికి అభివందనం .....
రోజులెంత శూన్యంగా కనిపించినా ....
తన దాగుడు మూతలతో నాకు దారి చూపించిన ఆ సర్వాంతర్యామికి సుమాంజలి ...
ఊసులే లేని నా జీవితాన తన చూపులతో, అల్లరి చేష్టలతో ....
నా జీవితానికి ఊపిరి అందించిన నా ప్రియ నేస్తానికి నమసుమాంజలి ......
ఆశల కెరటాలతో జీవితమనే సంద్రంలో అలలా ఎగిసిపడుతున్న నాకు ....
ఎదురీతనే నేర్పించి ఓ చుట్టపు చూపులా నను ఆ దరికి చేర్చిన నా గురువులందరికి పాదాభివందనం ....
వారందరికీ ఈ రోజున అక్షరాలతో నేను చేస్తున్న అభిషేకం ....... !!

లోకమంతా కొత్తగా కొంగొత్తగా, ప్రతి చిన్న విషయం వింతగా తోచిన వేళ .....
హృదయం చాచి ఆదరిస్తున్న కుటుంబ అనురాగ బంధానికి కుసుమాంజలి .....
ఊసులే లేని నా జీవితాన తన చూపులతో, అల్లరి చేష్టలతో ....
నా జీవితానికి ఊపిరి అందించిన నా ప్రియ నేస్తానికి నమసుమాంజలి ......
ఆశల కెరటాలతో జీవితమనే సంద్రంలో అలలా ఎగిసిపడుతున్న నాకు ....
ఎదురీతనే నేర్పించి ఓ చుట్టపు చూపులా నను ఆ దరికి చేర్చిన నా గురువులందరికి పాదాభివందనం ....
వారందరికీ ఈ రోజున అక్షరాలతో నేను చేస్తున్న అభిషేకం ....... !!
No comments:
Post a Comment