ఒంటరిగా
నన్ను
విడిచి
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను ....
ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా
వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను ....
ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
చెప్పు కోవాలనుకున్న కమ్మని
ఊసుల్లోనా
అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా
వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా
ప్రేమకు ప్రతి రూపమా అందానికే చిరునామా ...
నిజంగా నీ సోయగం వారెవ్వా .... !!
No comments:
Post a Comment