ఓ ప్రేమా ....
కల కన్నంతనే మెలకువతో ముగింపు లేనంతగా కరిగిపోయే కలలా ....
నిస్వార్థంగా నింగి నుంచి జారే చినుకుతో చినబోని ఆ మబ్బులా ...
మనసంతా కలవర మయ్యేలా ఉన్నా ....
క్షణం తీరిక లేకుండా,
ఆలోచనలనే ఆపలేక,
మనసుని మార్చలేక ,
నా ఊహలకి పగలే రెక్క లొచ్చినా ....
నా చూపులకు కళ్ళెం వేస్తున్న నీ చూపులని దాచుకోవాలని .....
నీ మనసులో ఏ మాయో చేయాలని అనుకున్నంతనే ....
అడుగుల్లో పరుగులు గుర్తొచాయి .....
ఉన్నటుండి మబ్బుల్లో మెరుపు వచ్చినట్టు ....
మాటల్లో వణుకులు పుట్టు కొచ్చాయి ....
మనసంతా అల్లకల్లోలమై .....
మూగబోయిన నా ముందు నీవు ఎదురయ్యే క్షణం .......
ఎడారిలో ఒయాసిస్సుని చూసినంతలా ....
చుక్కల్లో నిండు జాబిలిని చూసినంతలా ...
నా మనసు పెట్టిన పరుగులు కాస్తా అలా ఏదో మంత్రం వేసినట్టు కుదుటపడినంతలా ...
నోటి చివరన మాట కాస్తా గుండెల్లో చేరి ప్రేమలా అయిందిలా ......

No comments:
Post a Comment