Saturday, February 11, 2012


కొలిచే దేవుళ్ళెందరున్నా
మదిలో కొలువైనది నువ్వే

విరబూసే పువ్వులెన్నున్నా
వాడని చిరునవ్వు నీదే

పాడే కోయిలలెన్నున్నా
వినిపించే గానం నీదే

చూసే కళ్ళు నావైనా
అవి తాకే హృదయం నీదే

చిరుగాలి తాకేది నన్నైనా
మదిలో మెదిలే తలపు నీదే

చెదిరే కలలెన్నున్నా
చెదరని రూపం నీదే

కరిగే క్షణాలెన్నున్నా
కరగని జ్ఞాపకాలు నీవే

తరిగే కాలం ముందున్నా
తరగని కన్నీళ్ళు నీవల్లే

మౌనమె నా మది భాషైనా
అందులో మాటల సందడి నీదే

నదిచే బాటలెన్నున్నా
పరిగెత్తే పయనం నీవైపే

పిలిచే పిలుపులెన్నున్నా
పిలవని తలపులు నీవే

తపించే హృదయం నాదైనా
తలపించే మధురిమ నీదే

చెరిగే గాయాలెన్నున్నా
చెరగని గురుతులు నీవే

తీసే ఊపిరి నాదైనా
అది పొసే ప్రాణం నీదే

ఆగిపోయే గుండే నాదైనా
ఆగని ప్రేమ నీపైనే

ఏడడుగులు బంధం నీతో లేకున్నా
ఏదు జన్మల అనుబంధం నీతోనే

జీవన పయనం లో దారులెన్నున్నా
అంతిమ గమ్యం నీ దరికే

No comments:

Post a Comment