సుమధురం తన పేరు, మృదుమధురం తన పలుకు,
సున్నితం తన మనసు, సుకుమారం తన సొగసు !
చిరునవ్వే తనలోని ఆకర్షణ,
అభిమానమే తన ఆభరణం !!
చెలిమికి తనే చిరునామా,
వెలకట్టలేనిది తను నాపై చూపే ప్రేమ !!!
అందుకే మా స్నేహబంధం,
నేను ఎన్నటికి మరువలేని ఒక తియ్యని అనుబంధం !!!!
** సామల శ్రీనివాస్
No comments:
Post a Comment