ఓ అందమైన మరోప్రపంచం
అంతా ప్రకృతి సిరివెన్నెలమయం ..
ఆ తెల తెల్లారుతున్న సమయం
కోయిల స్వరాల కమ్మని సంగీతం ..
వింటుంటే ఎంతో ఆహ్లాదం
ఎదురుగా జాలువారే జలపాతం ..
చూస్తుంటే మనసంతా కోలాహలం
హరివిల్లు జలపాతాల అద్భుత సంగమం ..
ఆహా..
ఎంత నయనానందకరం .....
అంతలో ఎవరో తట్టినట్టు నా భుజం
ఉలిక్కిపడినే కనులు తెరచిన నిమిషం
చూడ చక్కని ఆ దృశ్యం
కలయా .. అని నేను చెందగా విస్మయం ..
అది ఎపుడయ్యేనో నిజం
అని వేచి చూడక తప్పదు కొంతకాలం !!
No comments:
Post a Comment