వీచే గాలిలో
వర్షించే మేఘంలో
పూచే పూవులలో
పసిపాప నవ్వులలో
వెతికాను నా నేస్తాన్ని
నా కిష్టమైన నీ స్నేహాన్ని..
మెరిసే తారలో
మయూరి నాట్యంలో
జాలువారే జలపాతంలో
జల జల పారే సెలయేటిలో
వెతికాను ఓ పువ్వుని
నా కిష్టమైన నీ నవ్వుని ...
నువ్వు .. నీ నవ్వు ...
నే వెతికే చోట ఉన్నా ... లేకున్నా ....
నిరాశే లేదు....
ఎందుకంటే
నా మనసులోనే నువ్వు ఉన్నావనే ఆశ !!
No comments:
Post a Comment