Wednesday, July 14, 2010

ఓ నేస్తమా... !!

ఓ నేస్తమా...


నా ఆశకు ఆలాపన నీవే
నా ఊహకు ఊపిరి నీవే !

నా ఎదకు అభిలాష నీవే
నా ఉనికికి ఊతం నీవే !

నా ఆలోచనకు ఆలంబన నీవే
నా ఆచరణకు అధినేత నీవే !

ఈ జీవన పద్మవ్యూహంలో
నే పట్టుజారిపోతున్న, నా ఆశాదివ్వే నీవే !

అలసిన మనసుకు సాంతన నీవే
ఆశయాల సంద్రాన చుక్కాని  నీవే
అలుపెరుగని పయనాన నా అసలు నేస్తం నీవే !!


No comments:

Post a Comment