Tuesday, December 30, 2014

మరుపురానివి నీవు పంచిన ఈ మధుర స్మృతులు
మైమరిపించే ఆ తీయని అనుభూతులు ...
చెరిగిపోనివి నీవు చూపిన ఆనందక్షణాలు ...
మళ్లీ తిరిగిరాని ఈ తీపి జ్ఞాపకాలతో ...
ఆనందంగా చెపుతున్నా నీకు వీడుకోలు .... !!!!

Monday, December 29, 2014

సాయం సంధ్యలో తీరమందు అలలపై నున్న నురగలా కరిగిపోతున్నా  ...

నిశిరాతిరిలో నిండైన ఆకాశాన్ని కారుమబ్బులలో కమ్ముతున్న చీకట్లలో కలిసిపోతున్నా ....

వీస్తున్న చల్లని గాలుల  దూళిలో కలిసిపోతున్నా ....

కారణం చెప్పాలని ఉన్నా ...

ఆ కారణం నీవే అని చెప్పలేక ఒంటరిగా కుమిలిపోతున్నా .... !!!!

Wednesday, December 10, 2014

రాలి పోయిన ఎండుటాకుల సందడి ...
రాకను తెలిపే నీ మువ్వల సవ్వడి లా అయిపోతోందనిపిస్తోంది..
అలుపెరుగని నా మౌన నిరీక్షణలో కాలం కలిసిపోతోంది ...

నా మదిలో కొలువుండిన నీ రూపం
పగిలిన గాజుల లా అతకలేని తీరం చేరిందే ...

రుతువులు మారి కొత్త చిగురాకులు వస్తాయేమో ...
కాలం లో కరిగే కలలు కూడా మళ్లీ వస్తాయి ...
అని మనసు సర్ది చెప్తున్నా ...
అవన్నీ మరు జన్మలోనే అని ఈ విధి కటినంగా చెప్తోంది ...
నీవుంటేనే ఉంటా అని చెపే నా మనసు ఈ మాటే వినటం లేదు ...

ప్రాణం పోయినా ఈ భాదే ఉండదేమో ...
కనిపించని నీ ఆచూకికై వెతుకుతున్నాయి నా కళ్ళు ....

నీవు వదిలిన దారిలోనే నా మనసుండి పోయింది అలా ...
నీవు లేని దారిలో వెళదామంటే చుక్కాని లేని నావైపోయింది నా పయనం ...

కలైన కరిగిపోతోంది తెల తెల వారడంతోనే ...
మరి నీకై వేచి చూసే సమయమే ఆగిపోతోంది ఎందుకిలా ....

చెపుకుంటున్నా వినటం లేని నా మనసుకి ...
అర్థం కాని ఈ ముగింపే వింతగా ఉన్నా ...
అంతం లేదంటోంది నా మదిలో ఉన్న నీపై ప్రేమ ... !!


Monday, November 17, 2014

నాలో నేనై ... నాతోనే నేనయ్యానుగా ...
నాకై నేనుగా, నా మనసులో ఉన్న ఊహలతో అంతర్యుద్ధం చేస్తున్నానుగా ...
మౌనంగా ఉన్న నా మనసులో అలజడిలా చేరి నా మది అనే కోవెలలో చేరిపోయావు ...
నా మనసులో ఉన్నది నువ్వే అయినా నీతో గెలవలేక ఓడిపోతున్నాను ...
నీకు చేపుకోలేక నిన్ను ఎందుకు అని అడగలేక మౌనంగా ఉన్నాను ....
నీకు నీ వారికి అండగా ఉండి రాకూడనివ్వకూడదు అనుకున్నాను ఏ కష్టం ...
విధి ఆడిన ఆటలో నను ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నావు ...
ఆలస్యంగా తెలిసింది నేను అనుకున్నవి అన్నీ కలలేనని ....
అందరికై జీవించి నాకై నేను జీవించలేక నాకే ఓ జ్ఞాపకమయ్యాను .....
నీవు నాలో లేని రేపటికోసం ఉండటం నా దృష్టిలో వ్యర్థం ...
బ్రతికినా నీవు లేవనే శోకం లో ఉండటం కష్టం ....
మనసులో నీ రూపానికి కోవెల కట్టినా అది రాతి గుండెనే తలపిస్తోంది ...
ఓడానో గెలిచానో తెలీదు కానీ నీవు లేని నా అంతరాత్మ అయింది నేటితోనే అంతం ... !!!

Wednesday, November 5, 2014

అమ్మాయి మనసు సముద్రంకన్నా లోతైనది ...
దూరo నుంచి చూస్తే ప్రశాంతంగానే కనిపిస్తుంది ... కానీ లోపల అంతులేని నిశబ్దం ...
నిశబ్దాన్ని అల్లరి చేస్తూ అలలా ఉంటుంది తన చిరునవ్వు ...
ఎటుచూసినా ఆ ఎగిసే అలలా తన నవ్వుల సవ్వడితో నిను మైమరిపిస్తుంది ....
సముద్రపు అల ఎంత ఎత్తు ఎగిసి తీరం వైపు పరుగు తీసినా ...
అదేదో నిను తాకేందుకే వస్తునట్టు ఉంటుంది ...
కానీ  నిజానికి ఆ అల ఆ తీరం దాటి రాలేదు ...
సంద్రంలోని నిశబ్దం బయటికి రాలేనట్టుగా ....
తన మనసులోని మాటలూ బయటికి రాలేవు  ..... !!!!

Monday, November 3, 2014

మొదటిసారి కలిసినపుడు అనిపించింది ....
ఇదే చివరిసారి అవ్వొద్దు అని ...

గుర్తుపెట్టుకున్నా మాట్లాడిన ప్రతి చిన్న మాటనీ ...
అది అంతగా ముఖ్యం కాకపోయినా అనిపించింది మరిచిపోవద్దు అని ...

రెండోసారి ... మూడోసారి ... ఇలా కలినన్ని సార్లు జ్ఞాపకంగా దాచుకున్నా ...
నీవు మాట్లాడిన ప్రతిచిన్న మాటనీ ...

రోజులు గడుస్తున్నా అనిపించింది ఇవాళ ఏం  మాట్లాడుతుందో అని ...
ఏదేదో మాట్లాడాలని అనుకున్నా నిన్ను చూసిన వేళ అంతా మరిచిపోతాను ....

కలిసిన సమయం కొంతే అని తెలిసి బాధపడినా ఆ కొంచెం సేపు అయినా దక్కినందుకు సంతోషించా ... 
సంతోషం బాధ అన్నీ మరిచిపోయాను తన ధ్యాసలోనే ...

వారానికి రెండే సెలవులైనా అనిపించేది తను చూడటం కుదరని ఈ వారంతం ఎందుకని ...
తను కనిపించని రోజులని లెక్కపెట్టా ... గంటలు .. నిమిషాలు .. ఆఖరికి క్షణాలు కూడా యుగాల్లా అనిపించాయి ...

యుగాల్లా అనిపించిన అదే క్షణాలు తను ముందుంటే ఆగేవి కావు ...
జీవితంలో ఏ  రోజు ఆనందంగా అనిపించింది అంటే అది నిన్ను కలిసిన ప్రతి రోజూ  అని చెప్తాను..

ప్రపంచమంతా ఒకవైపు నీవు నేను ఒకవైపు అనిపించేది ...
నీవు లేవు అని అనిపించినపుడల్లా అనిపిస్తుంది ప్రపంచం నీవు ఒకవైపు నేనొక్కడిని ఒకవైపు అని ....
నీవు లేని ఈ జీవితం ఊహించే కన్నా నీవు ఉన్నన్ని రోజులు అయినా ఆనందం చాలు అనిపిస్తుంది .... !!


Thursday, October 30, 2014

నిను వదిలి ఉండమంటే ఎలా ఉండను ...

నా నీడవే నీవు అయి ఉంటే చీకట్లో నా జీవితంని గడిపేవాడిని ....

నా కలవే నీవు అయితే నిదురనే దూరం చేసుకొనేవాడిని  ...

నా కన్నీరు వే నీవు అయితే అవి ఇంకేదాకా ఏడిచేవాడిని ....

కానీ నా శ్వాసే నీవైపోయావు ...

అలాంటి నిన్ను వదలమనడం అంటే నా ప్రాణం వదలడమే ....

ఈ ప్రపంచాన్ని తృణప్రాయం గా వదిలేయగలను కానీ నీ జ్ఞాపకాలని కాదు ... 

ఎలా వదలను నీ తోడుని ... నీ జ్ఞాపకాన్ని ...  ఓ నా ప్రాణమా .. !!! 

Wednesday, October 29, 2014

అందరూ అన్నారు ....

ప్రేమలో పడితే మాటలు రాకున్నా కవిత్వాలు రాస్తారని ...

కూనిరాగాలు రాకున్నా పాటలే వస్తాయని ....

నిజంగా ఇది సాధ్యం ఔతుందా అని అనిపించేది .....

అందరూ చెప్పారు ...

నిండు జాబిలిలో నిండైన తన మోము కనిపిస్తుందని ...

గాలి వీచినా తన కురుల సోయగమే తనని పలకరిస్తుందనీ ....

నిండు తుఫాను గాలేదో చల్లని మబ్బుల జల్లేదో అర్థం అవదనీ ....

కారు చీకటి కైనా నిండు జాబిలికైనా తేడా తెలియదనీ ....

అరిటాకు చప్పుల్లైనా ప్రేయసి నడిచే మువ్వల సవ్వడే అనిపిస్తుందనీ ....

అందరూ  అంటుంటే అనిపించింది ఇది సాధ్యమేమో అని  ....

అలా అని తలిచి ఏదో తీయగా రాద్దామని చూస్తుంటే అనిపిస్తుంది ...

మదిలో ఉంది ,,,,

తన పేరు.. తన జ్ఞాపకాలు ... తన మాటలు ....

నిన్న అని మొన్న అని తేడా లేకుండా అన్నీ నా హృదయమంతా అల్లుకుపోయాయని  ...

రాయడం రాదు అంటూనే తలచినవన్నీ పేరిస్తే ....

మరు జన్మకి జ్ఞాపకంగా నిలిచిపోతుంది నా ఈ ప్రేమకావ్యం ...

వద్దు ... తను నను చేరదు అని మదినిండా ఆలోచనలు తిరిగినా ....

తనని వద్దంటూనే నా మనసు మౌనంగా వెతుకుతుంది తన కై .. తన ఆచూకికై  .... తన ప్రేమకై ...

మౌనంగా నేను రాస్తున్నా ఈ కావ్యాన్ని  .... కావ్యమా లేక ప్రేమ లేఖా ... తనే చెప్పాలి  !!



Wednesday, August 13, 2014

స్వేచ్ఛ ... స్వాతంత్ర్యం ... స్వాభిమానం ... అభిమానం ....
ఇలా ఎన్ని పేర్లున్నా అన్నీ  చెప్పే అర్థం ఒకటే ....
ఏమి అర్థం చెప్పినా ఇవన్నీ  కేవలం మాటలే ...
మాటలని అందరు వినాలి అని లేదు కదా ...
మాటలెన్ని ఉన్నా మనలో మార్పు వచ్చేంత వరకు
ఇవన్నీ నీటి పై రాసిన పద రవలె కదా ....

కామంతో బలి అవుతున్న అమాయక అమ్మాయిల స్వేచ్చకి అర్థం ఎక్కడ ...
పాశ్చాత్య పైత్యంతో, ఆధునికత అనే ముసుగు లో చేస్తున్న ఈ  అసభ్యానికి పేరెక్కడ ...
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

కులం పేరుతో రాజకీయం,
ధనం పేరుతో కుతంత్రం,
అవినీతి కంపుతో కుల్లుతున్న అధికారం,
మతాల కులాల పేరుతో జనాల జీవితాలతో ఆటలాడుతున్న ఈ జనాధిపతుల కోసమా
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

పెళ్లి పేరుతో కట్నం,
అదనపు కట్నం పేరుతో శవ తాండవం ,
సమాజ విలువలని కాలరాస్తూ తల్లడిల్లుతున్నది పేగుబంధం
అన్ని బంధాలకి, విలువలకి సమాధి కడుతున్న ఈ నవ్య సమాజం కోసమా
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

మూడు పదులలో మాయమయ్యే అందంకోసం వెంపర్లాడుతూ ...
అంగడిలో సరుకుగా మారుతున్న అమ్మతనం ...
అమ్మతనాన్ని , నాన్నతనాన్ని మైమరిచి వృద్దాశ్రమం లో నెట్టేస్తున్న ఈ పేగుబంధాల కోసమా
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

ఎన్నో ఎన్నెన్నో ... ఇలా ఇంకెన్నో ....
రాస్తూ ఉంటే  ఇంకా ఎన్నో మది తలుపుల వెనుకాల దాగుతున్న బాధలేన్నో ....
ఏదో జరిగినప్పుడే ... అయ్యో అలా జరిగింది అనేకన్నా ...
జరిగేది ఆగాలి అంటే అది మనలో మార్పు వచినపుడే ...
అన్ని బంధాలకి, అనుబంధాలకి విలువిచ్చే నవ సమాజ నిర్మాణం కోసం
ఎదురుచూస్తున్న భారతావని జరుపుకుంటున్న కల్పిత స్వేచ్చా స్వాతంత్ర్యం దినోత్సవం ...
మనసారా కోరుకుందాం నిజమైన స్వాతంత్ర్యం రావాలని .... !!


 

Tuesday, July 1, 2014

కురిసే ఈ చిన్ని చిన్ని చినుకుల్లో 
మైమరిపించే స్వాతి ముత్యమల్లె నీ నవ్వులతో 
నా గుండెని ఇలా ఆనందంతో తడి పేసావు  ... 
ఎన్నో ఎన్నో ఆశలతో పెంచానమ్మా నా గుండెలో ఈ పూదోటా .... 
అలుపెరుగని నా కలలన్నీ నీ కన్నుల్లో కొనసాగించాలమ్మా .... 
చిత్రంగా ఉంది నీ మీద ఉన్న నా ప్రేమని చూస్తుంటే .... 
అందుకే నా మాటలతో రాస్తున్నా నా ఈ మాటల పూదోటని .... 
నీకు చేరుతుందో లేదో అని మీమాంస లో కన్నా నా కోసం వస్తావని .... 
నా మనసులో ప్రేమ నీ మనసుని తాకే ఆత్రుతతో వేచి చూస్తున్నా ... 
కొంచెం కోపం ... 
కొంచెం పొగరు ... 
కొంచెం అలక ... 
కొంచెం నవ్వు .... 
అన్నీ కలగలపి చేస్తున్నాయి నా ప్రేమని స్వచ్చంగా ..... 
మరి జీవితం చాలా చాలా  చిన్నది అయిపోతుంది ... 
చేరుస్తావో నా చుక్కాని లాంటి ముద్ద  మందారం .... :

Thursday, February 13, 2014

నా హృదయం లో దాచుకున్న అందమైన నీ ప్రతి రూపాన్ని .... 
నా మనసంతా ఆవహించిన అంతులేని ఆ ఊహల పరిమళాన్ని ..... 
నా కన్నులలో దాచుకున్న నీ చిరునవ్వుల చిరునామాల్ని .... 
నా కనురెప్పలపై నింపుకున్న నీ నవ్వుల ఊహా రేఖల పరిచయాన్ని ... 
నీ విరబూసిన బుగ్గలలో వదిలేసుకున్నా నా బిడియాన్ని .... 
నింపుకున్నా నా ఊహలలో నిండైన  ఆ వెన్నెల్లో తెరతీసిన నీ మోము రూపు రేఖల్ని.... 
అణువణువునా దాచుకున్న నీ బిడియపు అంచుల అందాలన్నీ .... 
నిద్దుర పోని నా భావాలపై అద్దుతున్నా నీ ఆశల అంచులన్నీ ..... 
చెప్పలేక, చూడకుండా ఉండలేక అల్లుతున్న ఈ మాటల పూదోటలన్నీ ..... 
మొన్నలేని భావాలెన్నో నిన్ననీ రాకతో మెలుకువ వచ్చినట్టుగా .... 
మాటరాని మౌనమేదో నా పెదాలపై ఒదిగిపోయినట్టుగా .... 
ఈ క్షణం లో ఆరాధనగా ఉన్నా మరు క్షణం లో ఆవేదనగా మిగిలినా ... 
ఆ ఒక్క క్షణమైనా నా మనసు పడే ఆనందమే నాకు మిగిలిపోదా కలకాలం .... 
ఒక్కొక్క క్షణమంతా కలగలసి ఈ జీవితమంతా ఉండిపోదా నీ తలుపులతో ..... 
ఈ ఒక్క క్షణం గురించి నీకు తెలపనా ప్రియా .... మరల తెలుపనా .... ప్రియా ..... !!!!

ప్రేమ తో .... 

నీకు 
ఈ ప్రేమికుల రోజున .... 


Friday, January 17, 2014

ఎదురొచ్చే కష్టాలని చూసి కంగారు పడకుండా ... 
చిరునవ్వుతో ఎదురెలితే ఆ కష్టాలే కాస్త కంగారు పడతాయి ... 
దేవుడు మనిషిని పుట్టించింది కష్ట సుఖాల తూకం చూడానికే అని తెలుసుకో .. 
ఎందుకంటే మనిషిలో కూడా దేవుడు ఉంటాడు అనే నిజం తెలుసుకో .. 
అందుకే కదా ప్రతి మనిషి ఒకరినొకరు గౌరవించమని చెపేది .. 
ఆ నిజాన్ని తెలుసుకున్నారు కాబట్టే
మదర్ థెరిస్సా ఒక దైవం లా అందరికీ  ఆదర్శం అయింది ... 
వివేకానందుడి మాట ప్రపంచమంతా వింది ...