Wednesday, August 13, 2014

స్వేచ్ఛ ... స్వాతంత్ర్యం ... స్వాభిమానం ... అభిమానం ....
ఇలా ఎన్ని పేర్లున్నా అన్నీ  చెప్పే అర్థం ఒకటే ....
ఏమి అర్థం చెప్పినా ఇవన్నీ  కేవలం మాటలే ...
మాటలని అందరు వినాలి అని లేదు కదా ...
మాటలెన్ని ఉన్నా మనలో మార్పు వచ్చేంత వరకు
ఇవన్నీ నీటి పై రాసిన పద రవలె కదా ....

కామంతో బలి అవుతున్న అమాయక అమ్మాయిల స్వేచ్చకి అర్థం ఎక్కడ ...
పాశ్చాత్య పైత్యంతో, ఆధునికత అనే ముసుగు లో చేస్తున్న ఈ  అసభ్యానికి పేరెక్కడ ...
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

కులం పేరుతో రాజకీయం,
ధనం పేరుతో కుతంత్రం,
అవినీతి కంపుతో కుల్లుతున్న అధికారం,
మతాల కులాల పేరుతో జనాల జీవితాలతో ఆటలాడుతున్న ఈ జనాధిపతుల కోసమా
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

పెళ్లి పేరుతో కట్నం,
అదనపు కట్నం పేరుతో శవ తాండవం ,
సమాజ విలువలని కాలరాస్తూ తల్లడిల్లుతున్నది పేగుబంధం
అన్ని బంధాలకి, విలువలకి సమాధి కడుతున్న ఈ నవ్య సమాజం కోసమా
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

మూడు పదులలో మాయమయ్యే అందంకోసం వెంపర్లాడుతూ ...
అంగడిలో సరుకుగా మారుతున్న అమ్మతనం ...
అమ్మతనాన్ని , నాన్నతనాన్ని మైమరిచి వృద్దాశ్రమం లో నెట్టేస్తున్న ఈ పేగుబంధాల కోసమా
ఈ స్వేచ్ఛ , ఈ స్వాతంత్ర్యం కోసమా మనమంతా ఎదురు చూసింది .... ??

ఎన్నో ఎన్నెన్నో ... ఇలా ఇంకెన్నో ....
రాస్తూ ఉంటే  ఇంకా ఎన్నో మది తలుపుల వెనుకాల దాగుతున్న బాధలేన్నో ....
ఏదో జరిగినప్పుడే ... అయ్యో అలా జరిగింది అనేకన్నా ...
జరిగేది ఆగాలి అంటే అది మనలో మార్పు వచినపుడే ...
అన్ని బంధాలకి, అనుబంధాలకి విలువిచ్చే నవ సమాజ నిర్మాణం కోసం
ఎదురుచూస్తున్న భారతావని జరుపుకుంటున్న కల్పిత స్వేచ్చా స్వాతంత్ర్యం దినోత్సవం ...
మనసారా కోరుకుందాం నిజమైన స్వాతంత్ర్యం రావాలని .... !!


 

No comments:

Post a Comment