Thursday, December 8, 2011

ఎప్పుడు మొదలైనా ..
ఎలా మొదలైనా ..
మొదలైన పరిచయం..
మనసుని తాకితే అదే స్నేహం.. 
కలిసిన స్నేహం కలకాలం కొనసాగితే ..
నడిచే దారంతా అవదా పూలవనం ..




Monday, November 28, 2011

తీరాన్ని తాకగానే ఇక ఉంటా అని పరుగెత్తే అల ..
సాయం మబ్బుల్లో దాగి నాకిక సెలవనే సూరీడు..
అరే నేనున్నానంటూ చల్లని వెన్నెల పంచే చంద్రుడు..
ఓహ్ .. అన్ని వేళలా ఉండటం వీటి వల్లా కాదుగా ..

 క్షణమైనా విడవని  నీడ తోడులా నీవుండగా..
మంచు దుప్పట్లో ఒదిగి విరబూసే పూమనసులా ..

నీ స్నేహం తో మనసంతా విరబూయదా..
మనసంతా విరిస్తే  ఆ మబ్బులనే తాకవా నా కలలు..
ఆ కలలు సాకారం కావా నీ స్నేహం విరబూయగానే ..
దివి లోని స్వర్గం ఈ దరి చేరదా..
స్వార్థం లేని ప్రేమని మించిన ఈ లోకాన ..
తరగని ఈ స్నేహం విలువ ఏ సిరి తో సరితూగదు కదా .,

అందుకే చెప్తున్నా ..
స్నేహమే కదా కడవరకు నిలిచేది .. దానికి సరి లేదు కదా ఈ లోకాన..
చేసే  ఈ స్నేహాన్ని .. మరువకు ఏనాడు .. మరింతగా కొనసాగాలి సాగే కాలంతో పాటుగా . ... !!










Friday, November 25, 2011

వర్షం రాబోయే ముందు ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి,
వర్షం వచ్చి వెళ్ళిపోగానే ఆకాశమంతా ప్రశాంతంగా స్వచ్చంగా మారిపోతుంది,
అదేవిధంగా జీవితంలో కూడా వర్షించే మేఘాలు కమ్ముకున్నప్పుడు కన్నీరు వర్షంలా కురుస్తుంది.
కాని అదే సమయంలో నీ చిరునవ్వు తెల్లవారిన స్వాతికిరణం లాగా వెలుగుతున్నప్పుడు మబ్బు నిన్ను చూసి తలవంచుకుంటుంది.

కావున నా నేస్తమా నీ అధరాల నుంచి చిరునవ్వుని ఎన్నడు దూరం కానివ్వకు...
నీ నవ్వుని చూసి నాలాంటి ఎందరో ప్రాణస్నేహితులకు అమృత వర్శమవుతుంది...
నీ చిరునవ్వుని నీ ఆదరాల ఫై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాక్షించే....
నీ నేస్తం.. !!





Thursday, November 24, 2011

పరితపించే నా  హృదయానికి  నీ  స్నేహం  కానుకలా దొరికింది ..
ముసుగువేసి మౌనం గా ఉన్న నా మనసు లో  అలజడి రేపావు ..
నా మనసులో ఈ ప్రేమ అలలను తాకే తీరం నీ దరినే కదా..

కలలే కన్నా నీ తలపుతో నేడు అవన్నీ నిజాలు అవుతాయనీ అనుకోలేదు  ..
విను వీధులలో నాకు సరి జోడులా సరిపోయావు  ..
పరిచయమే లేని కొత్త అనురాగాలను అందించావు ...

ఎడారి లో ఒయాసిస్సు లా ..
ఏ కల్మషం లేని పసి పాప నవ్వులా ..
చీకటిలో నుండి నాకు వెలుగులా కనిపించావు ..
నాకు సరికొత్త గమ్యంలా నిలిచావు ..
మరి నీకు తెలిపేందుకు నాకు భాషే రావడం లేదు .. 
ఈ పరుగెత్తే కాలం లో నీవొక క్షణం లా కరిగి పోతునావు   ..
కరుణ లేని ఈ కాలం క్షణమైనా ఆగదు కదా.. మరి నీవైనా కరునించవా .. !!




Wednesday, November 23, 2011

కన్నులపై కనుపాపనై పోనా..

అదరాన మాటనై  పోనా ..
పీల్చే శ్వాసనై పోనా .. 
మనసులో బావాన్నైదాగి పోనా..
నీవే లేని నా లోకాన జగమంతా సగమై కనిపిస్తోంది ..  
నీ నవ్వే లేని నా దారిన గమ్యం కూడా కనుమరుగైంది ..
మరి నే ఎంత వెతికినా నీ జాడే లేక పోయెనే.. 

అందుకే వెతుకుతున్నా ..
అలసినా ..
కాలం కరిగినా..
నీ పరిచయాన నా మాటల తడబాటుకై.. 
ఎధనై వెలసే ప్రేమ మైకంకై ..
వెలలేని తొలి పరవశంకై ...
నిన్ను కలిసే ఆ క్షణం కోసం .. 
నే ఇంకా ఎదురు చూస్తున్నా..  !!



ఇట్లు
.!.  శ్రీనివాస్ సామల  .!.



Saturday, November 19, 2011

సోమవారం నాడు అగుపించింది ..
మంగళవారం నాడు మైమరపించింది ..
బుధవారం నాడు బోల్తా కొట్టించింది ..
గురువారం నాడు గుర్తు పట్టానంది ..
శుక్రవారం నాడు సషేష మనిపించింది ..
శనివారం నాడు ఆలోచిస్తానంది ..
ఆదివారం నాడు ఏమిలేదంది ..
ఔను   నిజం ..
సోమవారం మళ్లీ అగుపించింది  .. !!


 




Sunday, November 6, 2011

ఓ ప్రేమ నీకు తెలుసా ....:

నిన్ను కలవాలని అనుకున్నాను... కలలు కనకు అన్నావు..
నీతో నడవాలి అనుకున్నాను... నాకు నడక రాదు అన్నావు..
నీతో మట్లాడలి అనుకున్నాను..మనస్కరించదం లేదు అన్నావు..
నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను... కాని కుదరదు అన్నావు..
నీతో ఒక్కొక్క అడుగు వెద్దాం అనుకున్నాను.... ఒంటరి వాడ్ని చేసావు..
నిన్ను గెలుచుకుందాం అనుకున్నాను... నన్ను గేళి చెసావు..
నీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...
నాతొ పని ఎమిటి అన్నావు..కంటి రెప్ప కంటే ఎక్కువగా ప్రేమించాను..
కన్నీల్లే మిగిల్చావు..నువ్వే నా లోకం అనుకున్నాను..
కాని లొకన్నే చీకటి చేశావు ఇంకేమి చెయాలి నీ కోసం???
"నీకోసం కలలు కంటూ కూర్చునాన్ను...కాని వాటిని నువ్వు కలగానే చేసావు.."

జీవన పయనం లో దారులెన్నున్నా ..
అంతిమ గమ్యం నీ దరికే !!

మరి ఇక ఉండనా..
ఇట్లు
శ్రీనివాస్ సామల

Wednesday, October 5, 2011

" నాకు వానలో తడవడం అంటే చాలా చాలా ఇష్టం ..
ఎందుకంటే నా కన్నీళ్ళని ఎవరూ చూడలేరు కదా .. !! "



Sunday, September 25, 2011



అక్షరాలతో సహవాసం..ఎంత అదృష్టమో కదా !
నీవు దూరం అయితే నాకు మిగిలింది ఇదేకదా
మాటలతో చెలిమి..
దూరం అయినప్పుడు వచ్చిన ఆలోచనలే ఇవి..
మనసును ఆవిష్కరించే కుంచె కదా !
అందుకే..గొప్ప కోసం వ్రాయడం లేదు
ఎవరి మెప్పు కోసమూ వ్రాయడం లేదు
ఆలోచన నన్ను నిలువనీయనపుడూ
సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
నీజ్ఞాపకాలు గుండెల్ని 
తాకినప్పుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా,
ఇలా రాస్తున్నది అని నీకు కూడా తెలుసు కాని...?

పదాల పొదుపూ ,పొందికా కుదురుతుంది .
ఆత్మ తృప్తి కొఱకు , ఆనందం పంచటానికి కాదు
ఆవేదన పంచుకోవటానికి
రాయడం లేదు...మనసు చంపుకొని రాస్తున్నా..
నీతో మాటలు పంచుకోలేనప్పుడు ..ఇలా చేస్తున్నా..ప్రియా..
నన్ను నేను గా కొల్పోయిన క్ష
ణంలో ఏంచేయాలో తెలీక ఇలా చేస్తున్నా .. !!



Sunday, September 11, 2011

కళ్ళలో వెన్నెల వెలుగులతో ..
పెదవులపై నవ్వుల పువ్వులతో ..
ఎదలో ఊసుల సవ్వడితో ..
మదిలో మాయని బాసలతో .. 
గుండెల్లో పొంగే ప్రేమతో ..
హృదయంలో తరగని తలపులతో ..
నాకోసం నడిచొచ్చే తరుణంకై  ..
వేచి ఉన్నా వేయి కన్నులతో నీకై ..
ఓ ప్రియా..
నేను ఒక ప్రశ్న లాగే మిగిలి పోతానేమో ..
అయినా కూడా
నీలో సమాధానం పొందే వరకు
వెతుకుతూనే ఉంటాను ..
ఎందుకో తెలుసా.. 
నా ప్రశ్నకు  సమాధానం నీవే కదా మరి .. !!




















Sunday, September 4, 2011

గురువులకు పాదాభివందనం ..
మీరు ప్రసాదించే జీవితం నందనం ..
మీరు అందుకోండి మా అభివందనం ..
ఆరాధించాలి మేము మిమ్మేన్నడు ..
ఆశీర్వదించాలి మీరు మమ్మేన్నడు.. 


నాకు చదువు చెప్పిన ప్రతి ఒక్క ఉపాద్యాయునికి పేరు పేరున పాదాభివందనాలు
లోకంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కృతజ్ఞాతాభివందనాలు  .. !!

Sunday, August 14, 2011

ఓ నేస్తమా..
వద్దన్నా వచ్చేది మరణం ..
పోవద్దన్నా పోయేది ప్రాణం ..
తిరిగిరానిది బాల్యం ..
మరువలేనిది స్నేహం ..
కిరణానికి చీకటి లేదు ..
సిరిమువ్వకి అలుపు లేదు  ..
చిరునవ్వుకి మరణం  లేదు ..
మన స్నేహానికి అంతం లేదు ..
మరిచే స్నేహం చేయకు ..
చేసే స్నేహం మరువకు  .. !!  

స్నేహానికి విలువనిచే ప్రతి స్నేహితునికి నా చిరు కానుక !! 

Friday, August 12, 2011

కళ్ళలో వెన్నెల వెలుగులతో ..
పెదవులపై నవ్వుల పువ్వులతో ..
మదిలో మాయని బాసలతో ...
నీవలా చూస్తూ ఉంటే ..
రెండు కనులు మూత పడవేమో ఆ బ్రహ్మ అద్దిన నీ మోము తలుకు చూసి ..
నిండు జాబిలి ఉలిక్కి పడునేమో పండు వెన్నెలలో నిను చూసి ..
బొండు మల్లెలు వాడిపోవునేమో నీ చిరునగవుల మినుకు చూసి ..

ఔను నిజం ..

తొలి ఉషోదయ కాంతి రేఖ ..
మలి సంధ్య కి అందిన ప్రేమలేక ..
భువిని వసంతాలు నింపే నీ రాక ..
దివిని చీకట్లు కమ్మే నీవు లేక .. !!

ప్రేమకు ప్రతి రూపమే అమ్మ ..
అనురాగానికి మారు రూపమే  నాన్న .. 
అమ్మ ప్రేమకు మారు  రూపమే అక్క ..
అనురాగాల రసభరితం వారి ప్రేమ ..
వెలకట్టలేము వారి  ప్రేమను ఈ లోకాన ..
భారతావని లో ప్రతి  ఒక్కరికి రాఖి పండగ శుభాకాంక్షలు  
ఒక్క నా ప్రియురాలికి తప్ప :) 

Tuesday, August 9, 2011

నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను .. 
నువ్వు రావని తెలిసినా ..
నిన్ను చూస్తూనే ఉంటాను ..
నువ్వు నా ఎదుట లేకున్నా ..
నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను ..
నీకు నే గుర్తుకు రాకున్నా ..
నిన్ను నా మనసులోనే కొలువుంచుతాను ..
నా హృదిని నీవు గాయపరిచినా ..
నిను ప్రేమిస్తూనే ఉంటాను ..
నీవు నను వీడి పోయినా ..  
నీవు ఈ లోకంలో లేవని తెలిసినా ..
నీ రాకకై  నేను వేచి చూస్తూనే ఉంటాను ..
ఈ జన్మ నీకే అంకితం !!

Wednesday, March 9, 2011

మొదటిసారి నీ కళ్ళ ఎదుట నిలిచిన రోజు కావాలి ..  

                    మళ్లీ కావాలి ...!

మొదటిసారి నీతో నడిచిన ప్రయాణం కావాలి ..

                    మళ్లీ కావాలి ...!

మొదటిసారి నీతో మాట్లాడిన క్షణం కావాలి  ..

                   మళ్లీ కావాలి ...!

మొదటిసారి నను తాకిన పులకరింత కావాలి ..
                   మళ్లీ కావాలి ...!

మొదటిసారి ....           ఒక్కసారి .....

ఒక్కసారి...

ఒక్కసారి ....

మళ్లీ తిరిగి రావాలి ... !!