అక్షరాలతో సహవాసం..ఎంత అదృష్టమో కదా !
నీవు దూరం అయితే నాకు మిగిలింది ఇదేకదా
మాటలతో చెలిమి..
దూరం అయినప్పుడు వచ్చిన ఆలోచనలే ఇవి..
మనసును ఆవిష్కరించే కుంచె కదా !
అందుకే..గొప్ప కోసం వ్రాయడం లేదు
ఎవరి మెప్పు కోసమూ వ్రాయడం లేదు
ఆలోచన నన్ను నిలువనీయనపుడూ
సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
నీజ్ఞాపకాలు గుండెల్ని తాకినప్పుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా,
ఇలా రాస్తున్నది అని నీకు కూడా తెలుసు కాని...?
పదాల పొదుపూ ,పొందికా కుదురుతుంది .
ఆత్మ తృప్తి కొఱకు , ఆనందం పంచటానికి కాదు
ఆవేదన పంచుకోవటానికి
రాయడం లేదు...మనసు చంపుకొని రాస్తున్నా..
నీతో మాటలు పంచుకోలేనప్పుడు ..ఇలా చేస్తున్నా..ప్రియా..
నన్ను నేను గా కొల్పోయిన క్షణంలో ఏంచేయాలో తెలీక ఇలా చేస్తున్నా .. !!
No comments:
Post a Comment