మొదటిసారి నీ కళ్ళ ఎదుట నిలిచిన రోజు కావాలి ..
మళ్లీ కావాలి ...!
మొదటిసారి నీతో నడిచిన ప్రయాణం కావాలి ..
మళ్లీ కావాలి ...!
మొదటిసారి నీతో మాట్లాడిన క్షణం కావాలి ..
మళ్లీ కావాలి ...!
మొదటిసారి నను తాకిన పులకరింత కావాలి ..
మళ్లీ కావాలి ...!
మొదటిసారి .... ఒక్కసారి .....
ఒక్కసారి...
ఒక్కసారి ....
మళ్లీ తిరిగి రావాలి ... !!
No comments:
Post a Comment