Wednesday, November 23, 2011

కన్నులపై కనుపాపనై పోనా..

అదరాన మాటనై  పోనా ..
పీల్చే శ్వాసనై పోనా .. 
మనసులో బావాన్నైదాగి పోనా..
నీవే లేని నా లోకాన జగమంతా సగమై కనిపిస్తోంది ..  
నీ నవ్వే లేని నా దారిన గమ్యం కూడా కనుమరుగైంది ..
మరి నే ఎంత వెతికినా నీ జాడే లేక పోయెనే.. 

అందుకే వెతుకుతున్నా ..
అలసినా ..
కాలం కరిగినా..
నీ పరిచయాన నా మాటల తడబాటుకై.. 
ఎధనై వెలసే ప్రేమ మైకంకై ..
వెలలేని తొలి పరవశంకై ...
నిన్ను కలిసే ఆ క్షణం కోసం .. 
నే ఇంకా ఎదురు చూస్తున్నా..  !!



ఇట్లు
.!.  శ్రీనివాస్ సామల  .!.



No comments:

Post a Comment