Wednesday, July 18, 2012

ఓ ప్రేమా ....
కల కన్నంతనే  మెలకువతో ముగింపు లేనంతగా కరిగిపోయే కలలా ....
నిస్వార్థంగా  నింగి నుంచి జారే చినుకుతో చినబోని ఆ మబ్బులా ...
మనసంతా కలవర మయ్యేలా ఉన్నా ....
క్షణం తీరిక లేకుండా,
ఆలోచనలనే ఆపలేక,
మనసుని మార్చలేక ,
నా ఊహలకి పగలే రెక్క లొచ్చినా ....
నా చూపులకు కళ్ళెం వేస్తున్న నీ చూపులని దాచుకోవాలని   .....
నీ మనసులో ఏ మాయో చేయాలని అనుకున్నంతనే  ....
అడుగుల్లో పరుగులు గుర్తొచాయి .....
ఉన్నటుండి మబ్బుల్లో మెరుపు వచ్చినట్టు ....
మాటల్లో వణుకులు పుట్టు కొచ్చాయి ....
మనసంతా అల్లకల్లోలమై .....
మూగబోయిన నా ముందు నీవు ఎదురయ్యే క్షణం .......
ఎడారిలో ఒయాసిస్సుని చూసినంతలా ....
చుక్కల్లో నిండు జాబిలిని చూసినంతలా  ...
నా మనసు పెట్టిన పరుగులు కాస్తా అలా ఏదో మంత్రం వేసినట్టు కుదుటపడినంతలా ...
నోటి చివరన మాట కాస్తా గుండెల్లో చేరి ప్రేమలా అయిందిలా ......






Monday, July 16, 2012

నా మాటలో  నీ పేరే మంత్రంలా వినిపిస్తోంది ....
నాతో  పాటు నడిచోచే నీ రాకనే మరిచి ....
నా వయసు కాలంతో పరుగులు పెడుతోంది .... 
జాలి లేని ఈ మేఘమెలా కటినంగా ఉందో ....
ఆ మేఘమెపుడైనా కరగదా అని జాలి గా చూసే ఆ చకోర పక్షే నాకాదర్శమవదా  ....
తొలి తొలి వలపుల తొలి తొలి చూపులని నీవు మరిచినా  ...
నను విడిపోయినా అనుక్షణం నను కదిపే నా కన్నీళ్ళ లో నీ  రూపం చెదిరిపోకుండా దాచుకుంటాను .....
ఆ చోటా ఈ చోటా అని వెతకడం తోనే నే ఆగను ....
నా మది నిలిచిన నీవు దారి చూపిన గమ్యాన నను కలుస్తావని .....
వేచే నా మదిని నీ ప్రేమ తో కరునిస్తావని కడదాకా నే వేచి ఉండనా  ...... !!




Tuesday, June 26, 2012

ప్రేమ అనేది bubble gum లాంటిది .. మొదట్లో చాలా తీయగా ఉంటుంది ..... తరవాత  తరవాత ఎందుకు రా బాబోయ్  అనిపిస్తుంది .... కాని స్నేహం వేప పూవు లాంటిది ... మొదట్లో చాలా  చేదుగా ఉన్నా ... కాలంతో పాటుగా తీయగా అవుతుంది .....


తెలుగులో ప్రతి సినిమా కి పేర్లు మాత్రమే డిఫరెంట్ గా పడతాయి  ...కాని స్టొరీ మాత్రం ఒకటే ....
అలాగే అందరి లైఫ్ లో ప్రేమ స్టోరీస్ మాత్రమే  డిఫరెంట్ గా ఉంటాయి .... కాని ముగింపు మాత్రం  ఒకటే ....
సినిమాలో పేర్లు డిఫరెంట్ గా పడ్డాయని సినిమా బాలేక పోయినా మళ్ళీ మళ్ళీ చూడలేం కదా..
అలాగే లైఫ్ లో ప్రేమ కూడా ...
ఎపుడూ మనసు పరితపిస్తూ ఉంటుంది అని
స్నేహాన్ని వదిలేసి మరీ ప్రేమ వెంట పరుగులు తీసావా ....
అంతే ....
తకిట తకిట ....
తీరం తో కెరటం ఆటాడినట్టు ....
జీవితం తో ప్రేమ ఒక ఆటాడేస్తది ....
సినిమా లో పేర్లు సరిగా పడకపోయినా పర్లేదు సినిమా బాగుంటే చాలు ....
మనసు robbery కాకుండా ఉంటె అదే చాలు .... !!


Monday, June 11, 2012

ప్రేమ అని తలిచాను ....
తలిచిన మరు క్షణం నా నీడను సైతం నీ ద్యాసలో మరిచాను ...
నిను కలిసానని కలలే కన్నాను ...
మరి నిజంగా కలిస్తే ఆ కరిగిన కాలం లోని కల కన్నా త్వరగా కనుమరుగయ్యావు ....

అలిసిన నా మనసుకి నచ్చ చెప్పాను ...
వెంట పడి దిక్కు తెలియని దూరం చేరే కన్నా ....
కటువుగా ఉన్న కాలం కు నా మనసు తెలియ పరచాలని .....
మౌనంగా ఉన్నా  ...
ఎటుచూసినా ఎటు వెళ్ళినా
నా వైపు వచ్చే నీ జ్ఞాపకాలనీ  ....
నా మనసు అంచులలో దాచుకున్నాను పదిలంగా ....

కనిపించే ఈ లోకానికి నేను ఒంటరిని  అనిపించొచ్చు  ...
కాని నీకై నే వేచే క్షణం క్షణం ..
క్షణాలన్నీ కలిసి చివరికి నిమిషం  అయినట్టుగా ...
నీవు నేను కలిసి ప్రేమకి చిరునామా అన్నట్టుగా  అవుదామా ....
మరి నీవు నను కలిసే ఆ క్షణంని  దాచుకుంటా పదిలం గా ...
ఆ నిమిషం ఇపుడైనా కావచ్చు ... మరు జన్మకైనా ....
వేచి ఉంటాను నీకై ...
తొలి వర్షపు చినుకుకై వేచే చకోర పక్షిలా .... !!

Wednesday, May 30, 2012

 
సముద్రాన్ని చూస్తే కదిలే అలలే కనిపిస్తాయి  ..
ఆమ్మాయిని చూస్తే మెదిలే కలలే వస్తాయి ..
కానీ తీరాన్ని దాటి సముద్రం లోతుగా వెల్లామా ..
ప్రశాంతమైన నిషబ్దం ....
కానీ అమ్మాయి గుండె లోతుల్లో తొంగి చూసావా ..
అంతే 
జీవితంలో ప్రశాంతతే ఆవిరై పోతుంది ....

Saturday, May 26, 2012


ఒంటరిగా నన్ను విడిచి
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను ....

ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
చెప్పు కోవాలనుకున్న  కమ్మని ఊసుల్లోనా

అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా

వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా
నా ప్రేమకు ప్రతి రూపమా అందానికే చిరునామా ...
నిజంగా నీ కనుల సోయగం వారెవ్వా ....  !!

Wednesday, May 2, 2012

ఒంటరిగా నన్ను విడిచి
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను ....

ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
చెప్పు కోవాలనుకున్న  కమ్మని ఊసుల్లోనా

అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా

వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా
ప్రేమకు ప్రతి రూపమా అందానికే చిరునామా ...
నిజంగా నీ సోయగం వారెవ్వా ....  !!