నా ప్రాణం నీవై పోయావు ....
నా శ్వాసలో కలిసిపోయావు ....
నీవు లేవనే నిజాన్ని నేను ఎలా నమ్మగలను ...
కరుణించని కాలం ఈ దూరాన్ని పెంచోస్తోంది ...
నిను చూపించి వరమిచ్చిన దేవుడు ..
నిను కలపలేని నిజాన్ని చెప్పలేదే ...
వెంట నడిచాను ...
నీకోసం అనుక్షణం వేచి ఉన్నాను ...
నీవు లేని ఈ లోకాన అందరికి దూరంగా ఉన్నా ...
నిజం ...
ప్రేమనేది నిజం ...
అది నిను చూసాకే తెలిసింది ....
శూన్యం అయిన దారిలో దీపం లా నను నడిపించావు ....
నీవు లేని నా పయనం గమ్యం మరిచిన నావై పోయిందిగా ...
ప్రపంచం మరిచాను నీ ధ్యాసలో ....
ప్రేమని ప్రేమిస్తే అది ప్రేమనే మిగలని శూన్యం అయిపోయిందిగా .... !!!