పరితపించే నా హృదయానికి నీ స్నేహం కానుకలా దొరికింది ..
పరిచయమే లేని కొత్త అనురాగాలను అందించావు ...
నీ కళ్ళలో దాచుకోకు .. అలా కన్నీళ్లు వస్తే నను ఎలా నీవు చూసేది ...
పై పైన మనిషిని చూడకు .. నా మనసులోనుంచి వచ్చిన ఈ మాటలని విను ...
నేను పిలిచే ఒక పిలుపుతోనే నా ఎదురున నిలిచావు ..

ఎడారి లో ఒయాసిస్సు లా ..
ఏ కల్మషం లేని పసి పాప నవ్వులా ..
చీకటిలో నుండి నాకు వెలుగులా కనిపించావు ..
నాలోని భావన నీవైపు వస్తే .. నాలోని దాని ప్రతిస్పందనలో నీవై ఉన్నావు ...
మనం కలిసిన ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకంలా నా మదిన కొలువై ఉంది ...
పరుగెత్తే ఈ కాలం లో క్షణాలు కరిగినా ... మన స్నేహం కరగకూడదని కోరుకుంటున్నా ...
మదిలోని భావాలను మనసారా పంచుకొనే ఓ ఆత్మీయ స్నేహ బంధమా ...
బాధ అయినా సంతోషమైనా భరించేందుకు తోడుగా నిలిచావు ...
నీ చిరునవ్వుని కలకాలం ఇలానే ఉండనివ్వు ...
నేను మరవని ప్రియనేస్తం .. నేను తలచే ప్రతిక్షణం నీ ఆనందం కోసం ...
అంతులేనిది మనస్నేహం ... ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ...
మనసారా చెపుతున్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ... !!!!
No comments:
Post a Comment