Thursday, November 19, 2015

నీ చిరునవ్వుతో నా రోజు మొదలయ్యేది ...
నీవు లేని నా రోజులు చిరునవ్వే లేక బోసిపోతున్నాయి  ...
రొజూ కలిసే రోజులన్నీ గతమే అయిపోయాయి ...
నీకోసం నిరీక్షించే ప్రతి రొజూ ఆనందమే నా చుట్టూ ఉండేది ....
నీవు లేవనే ఊహనే నా జీవితాన్ని హరించేస్తోంది ...
ప్రతి క్షణం నీకోసమే నా ద్యాసై పోయిందే ....
బ్రతికుండగానే నా ప్రాణం నిర్జీవమై పోతోంది ....
మరునిమిషం ఉంటానో లేనో ...
మరి మరు జన్మలనైనా కరుణిస్తుందా ఈ లోకం ...
నిను చూడని నా కళ్ళు, కన్నీళ్ళతో నిండిపోయాయి ....

ప్రేమించే టప్పుడు ఆనందం నేనొక్కడినే అనుభవించాను ...
ఆ ప్రేమే బాధని పుట్టిన్చినప్పుడు దాన్నినేనే అనుభవిస్తాను ...
ప్రేమించాలంటే ఆ ప్రేమని గెలుచుకొనే గొప్ప పోరాటం చేయాలి ...
లేదంటే ఆ ప్రేమనే త్యాగం చేసే గొప్ప మనసైనా ఉండాలి ...
నేను గొప్ప ప్రేమికుడిని కాకపోవచ్చు ...
త్యాగం చేసే శక్తి నాకు లేకపోవచ్చు ....
కానీ ఎక్కడ ఉన్నా నీ సంతోషం కోరే మనసు నాకుంది ...
ఇది నీకు తెలియాలి అనే తీరం అవతల ఉన్నా నీ దరి చేరేలోపు నీకు తెలపాలని పంపుతున్నా నా మనసులో మాటని  !!!!


No comments:

Post a Comment