Tuesday, December 30, 2014

మరుపురానివి నీవు పంచిన ఈ మధుర స్మృతులు
మైమరిపించే ఆ తీయని అనుభూతులు ...
చెరిగిపోనివి నీవు చూపిన ఆనందక్షణాలు ...
మళ్లీ తిరిగిరాని ఈ తీపి జ్ఞాపకాలతో ...
ఆనందంగా చెపుతున్నా నీకు వీడుకోలు .... !!!!

Monday, December 29, 2014

సాయం సంధ్యలో తీరమందు అలలపై నున్న నురగలా కరిగిపోతున్నా  ...

నిశిరాతిరిలో నిండైన ఆకాశాన్ని కారుమబ్బులలో కమ్ముతున్న చీకట్లలో కలిసిపోతున్నా ....

వీస్తున్న చల్లని గాలుల  దూళిలో కలిసిపోతున్నా ....

కారణం చెప్పాలని ఉన్నా ...

ఆ కారణం నీవే అని చెప్పలేక ఒంటరిగా కుమిలిపోతున్నా .... !!!!

Wednesday, December 10, 2014

రాలి పోయిన ఎండుటాకుల సందడి ...
రాకను తెలిపే నీ మువ్వల సవ్వడి లా అయిపోతోందనిపిస్తోంది..
అలుపెరుగని నా మౌన నిరీక్షణలో కాలం కలిసిపోతోంది ...

నా మదిలో కొలువుండిన నీ రూపం
పగిలిన గాజుల లా అతకలేని తీరం చేరిందే ...

రుతువులు మారి కొత్త చిగురాకులు వస్తాయేమో ...
కాలం లో కరిగే కలలు కూడా మళ్లీ వస్తాయి ...
అని మనసు సర్ది చెప్తున్నా ...
అవన్నీ మరు జన్మలోనే అని ఈ విధి కటినంగా చెప్తోంది ...
నీవుంటేనే ఉంటా అని చెపే నా మనసు ఈ మాటే వినటం లేదు ...

ప్రాణం పోయినా ఈ భాదే ఉండదేమో ...
కనిపించని నీ ఆచూకికై వెతుకుతున్నాయి నా కళ్ళు ....

నీవు వదిలిన దారిలోనే నా మనసుండి పోయింది అలా ...
నీవు లేని దారిలో వెళదామంటే చుక్కాని లేని నావైపోయింది నా పయనం ...

కలైన కరిగిపోతోంది తెల తెల వారడంతోనే ...
మరి నీకై వేచి చూసే సమయమే ఆగిపోతోంది ఎందుకిలా ....

చెపుకుంటున్నా వినటం లేని నా మనసుకి ...
అర్థం కాని ఈ ముగింపే వింతగా ఉన్నా ...
అంతం లేదంటోంది నా మదిలో ఉన్న నీపై ప్రేమ ... !!