Monday, February 27, 2012

నీ దూరం చేరాలని రెండు పట్టాల ఈ బతుకు బండిలో పరుగెడుతున్నా  ...
నాకు నీ మీదున్న ఆశలే పట్టాలై ..
సెకనుకు నీ వైపు కాంతి వేగం తో వస్తున్నా ..
నీ ఇష్టాలే నా ఇంజనై ..
బాధలనే బ్రిడ్జిలని దాటుతున్నా ...
నీకోసం ...
కేవలం నీకోసం ఓ ప్రియా ... !!

Saturday, February 11, 2012


ఒంటరిగా నన్ను విడిచి
నా హృదయాన్ని తీసుకెళ్ళిన
నిను ఎక్కడని వెతకను

ప్రేమతో రాసుకున్న అక్షరాల్లోనా
కలసి తిరుగాడిన ప్రదేశాల్లోనా
చెప్పుకున్న కమ్మని ఊసుల్లోనా

అందంగా దోబూచులాడే ఆలోచనల్లోనా
మరపురాని తీయని తలపుల్లోనా
తలపించే స్వచ్ఛమైన నీ నవ్వుల్లోనా

వదిలి వెళ్ళిన నీ జ్ఞాపకాల్లోనా
హృదయంలో నిదురించే నీ కలల్లోనా
నిత్యం మనసు చేసే అలజడుల్లోనా
అనునిత్యం విలపించే నా గుండె లోతుల్లోనా

కొలిచే దేవుళ్ళెందరున్నా
మదిలో కొలువైనది నువ్వే

విరబూసే పువ్వులెన్నున్నా
వాడని చిరునవ్వు నీదే

పాడే కోయిలలెన్నున్నా
వినిపించే గానం నీదే

చూసే కళ్ళు నావైనా
అవి తాకే హృదయం నీదే

చిరుగాలి తాకేది నన్నైనా
మదిలో మెదిలే తలపు నీదే

చెదిరే కలలెన్నున్నా
చెదరని రూపం నీదే

కరిగే క్షణాలెన్నున్నా
కరగని జ్ఞాపకాలు నీవే

తరిగే కాలం ముందున్నా
తరగని కన్నీళ్ళు నీవల్లే

మౌనమె నా మది భాషైనా
అందులో మాటల సందడి నీదే

నదిచే బాటలెన్నున్నా
పరిగెత్తే పయనం నీవైపే

పిలిచే పిలుపులెన్నున్నా
పిలవని తలపులు నీవే

తపించే హృదయం నాదైనా
తలపించే మధురిమ నీదే

చెరిగే గాయాలెన్నున్నా
చెరగని గురుతులు నీవే

తీసే ఊపిరి నాదైనా
అది పొసే ప్రాణం నీదే

ఆగిపోయే గుండే నాదైనా
ఆగని ప్రేమ నీపైనే

ఏడడుగులు బంధం నీతో లేకున్నా
ఏదు జన్మల అనుబంధం నీతోనే

జీవన పయనం లో దారులెన్నున్నా
అంతిమ గమ్యం నీ దరికే

Friday, February 10, 2012

నేను ప్రేమించిన ఒక అందమైన కల .. 
అది నీ రాకతో నిజం చేసావు .... 
కను చూపు మేరలో చూసాను నీ కను రెప్పల కాటుక సోయగాన్ని ... 
నీ చిరునవ్వుల చప్పుడుతో నా హృదయంలో అలజడి రేపావు  ...
నీ చూపులతో నను మైమరిపించావు ...
 నీ వాలు కనుల సోయగం తో నను మురిపించావు ...
నా మోముపై నీ చిరునవ్వులతో పూవన్నెల అందాన్నిచ్చావు .. 
ఎలా ఎలా ...
నీకు నా మనసులో మాట చెప్పేది ఎలా ..
నీవే నాలోకమని ... 
నీకోసమే నే వేచి ఉన్నా అని .. 
నీ ఎదుట నిలిస్తే నాకు మాటే రాదేలా ... 
మరి నా మనసులో మాటని నీకు తెలిపేదేలా ... 
ఎలా ఎలా ..... .. !! 






 

Saturday, February 4, 2012

కాలరాత్రిని చూసి కలత చెందకు ... 
వచ్చే ప్రశాంత సూర్యోదయం కొరకు వేచి చూడు .. 
పూవు రాలిందని కలవర పడకు .. 
వచ్చే నవ వసంతానికి స్వాగతం పలుకు .. 
కష్టాలొచ్చాయని కుంగిపోకు .. 
కష్టాలవెనకే  వచ్చే ఆనందాలకై ఎదురు చూడు .. 
క్షణాల ఈ జీవితంలో ఏ క్షణాన్ని వదులుకోకు ...
ప్రతి క్షణం ఇతరులకు నీ ప్రేమని పంచు ..  
ఎందుకంటే ఈ జీవితం ఒక పాలసముద్రం లాంటిది .. 
వచ్చే అమృతం కొరకు ఆశ తో వేచి చూడాలి .. 
ఇదే జీవితం ... 
వేచి చూడటంలోనే ఉంది అసలైన జీవిత పరమార్థం ...   !!