తీరాన్ని తాకగానే ఇక ఉంటా అని పరుగెత్తే అల ..
సాయం మబ్బుల్లో దాగి నాకిక సెలవనే సూరీడు..
అరే నేనున్నానంటూ చల్లని వెన్నెల పంచే చంద్రుడు..
ఓహ్ .. అన్ని వేళలా ఉండటం వీటి వల్లా కాదుగా ..
క్షణమైనా విడవని నీడ తోడులా నీవుండగా..
మంచు దుప్పట్లో ఒదిగి విరబూసే పూమనసులా ..
నీ స్నేహం తో మనసంతా విరబూయదా..
మనసంతా విరిస్తే ఆ మబ్బులనే తాకవా నా కలలు..
ఆ కలలు సాకారం కావా నీ స్నేహం విరబూయగానే ..
దివి లోని స్వర్గం ఈ దరి చేరదా..
స్వార్థం లేని ప్రేమని మించిన ఈ లోకాన ..
తరగని ఈ స్నేహం విలువ ఏ సిరి తో సరితూగదు కదా .,
అందుకే చెప్తున్నా ..
స్నేహమే కదా కడవరకు నిలిచేది .. దానికి సరి లేదు కదా ఈ లోకాన..
చేసే ఈ స్నేహాన్ని .. మరువకు ఏనాడు .. మరింతగా కొనసాగాలి సాగే కాలంతో పాటుగా . ... !!