Sunday, August 14, 2011

ఓ నేస్తమా..
వద్దన్నా వచ్చేది మరణం ..
పోవద్దన్నా పోయేది ప్రాణం ..
తిరిగిరానిది బాల్యం ..
మరువలేనిది స్నేహం ..
కిరణానికి చీకటి లేదు ..
సిరిమువ్వకి అలుపు లేదు  ..
చిరునవ్వుకి మరణం  లేదు ..
మన స్నేహానికి అంతం లేదు ..
మరిచే స్నేహం చేయకు ..
చేసే స్నేహం మరువకు  .. !!  

స్నేహానికి విలువనిచే ప్రతి స్నేహితునికి నా చిరు కానుక !! 

Friday, August 12, 2011

కళ్ళలో వెన్నెల వెలుగులతో ..
పెదవులపై నవ్వుల పువ్వులతో ..
మదిలో మాయని బాసలతో ...
నీవలా చూస్తూ ఉంటే ..
రెండు కనులు మూత పడవేమో ఆ బ్రహ్మ అద్దిన నీ మోము తలుకు చూసి ..
నిండు జాబిలి ఉలిక్కి పడునేమో పండు వెన్నెలలో నిను చూసి ..
బొండు మల్లెలు వాడిపోవునేమో నీ చిరునగవుల మినుకు చూసి ..

ఔను నిజం ..

తొలి ఉషోదయ కాంతి రేఖ ..
మలి సంధ్య కి అందిన ప్రేమలేక ..
భువిని వసంతాలు నింపే నీ రాక ..
దివిని చీకట్లు కమ్మే నీవు లేక .. !!

ప్రేమకు ప్రతి రూపమే అమ్మ ..
అనురాగానికి మారు రూపమే  నాన్న .. 
అమ్మ ప్రేమకు మారు  రూపమే అక్క ..
అనురాగాల రసభరితం వారి ప్రేమ ..
వెలకట్టలేము వారి  ప్రేమను ఈ లోకాన ..
భారతావని లో ప్రతి  ఒక్కరికి రాఖి పండగ శుభాకాంక్షలు  
ఒక్క నా ప్రియురాలికి తప్ప :) 

Tuesday, August 9, 2011

నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను .. 
నువ్వు రావని తెలిసినా ..
నిన్ను చూస్తూనే ఉంటాను ..
నువ్వు నా ఎదుట లేకున్నా ..
నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను ..
నీకు నే గుర్తుకు రాకున్నా ..
నిన్ను నా మనసులోనే కొలువుంచుతాను ..
నా హృదిని నీవు గాయపరిచినా ..
నిను ప్రేమిస్తూనే ఉంటాను ..
నీవు నను వీడి పోయినా ..  
నీవు ఈ లోకంలో లేవని తెలిసినా ..
నీ రాకకై  నేను వేచి చూస్తూనే ఉంటాను ..
ఈ జన్మ నీకే అంకితం !!