Tuesday, March 19, 2013

అణువు అణువు ని తాకి ఫోటాన్ ని మార్చుకుంటే అనంతమైన శక్తి పుడుతుంది ...
మనసు మనసు ని తాకి ఆలోచనలని/భావాల్ని మార్చుకుంటే అనంతమైన ప్రేమ పుడుతుంది .... 

Tuesday, March 12, 2013

మరువలేనివి ఆ నాటి తీపి జ్ఞాపకాలు .. కాలం మారినా మనతోనే ఉన్నాయి ... నా మనసులో ఇంకా ఉన్నాయి ... 

Tuesday, February 12, 2013

Truely yours.... !!

వినిపించే నీ మాట లోని హాయి నాకు మరెపుడూ కలగదుగా ....
అలసిపోయాను నిను తలుస్తూ కాలాన్ని భారంగా నెట్టుకువస్తున్నాను ...
నను వదిలి వెళ్ళిన చోటే నీకోసం వేచి చూస్తున్నా ...
నిన్నలోని చేదు జ్ఞాపకంని మరిచిపోదామని అనుకున్నా  ...
నేటిలోని నిజానికి తలవంచుతున్నా ...
కలలతోనే కాలయాపన చేద్దామని తలచినా ...
నిజాల జాడలో అసలు నిద్దరే దరిచేరదే.....
ఒంటరిగా దిగాలుగా నిలుచున్నా...
నీ ధ్యాసలో ... !!!

 

Friday, October 5, 2012

ఓ దేవుడా ఈ సమంత ని ఒకసారి చూడవయా ...
లోకాన మాయ చేసే నీకూ మాయే చేస్తుంది
అపుదనిపిస్తుంది నీకూ నాలా ....

తన కన్నులపై కనుపాపనై పోనా..
లేక తన అదరాన మాటనై పోనా ..
లేక తను పీల్చే శ్వాసనై పోనా ..
ఇంకాస్త చోటిస్తే ఆ మనసులో బావాన్నైఒదిగి పోనా....

ఏ మయ్యా..
ఏందయ్యా ....
ఈ మాయే0దయ్యా .... ..... .
ఏదో ఒక మాయ నిజంగానే చేస్తుంది కదా ...:) ;) :P :D

Wednesday, September 26, 2012


సాయం కోరావని నువ్వు చేతకానివాడివి కాదు ...
సాయం చేసావని గొప్పవాడివి కావు ...
సాయంని సహాయాన్ని ఎటుచూసినా ఒకేలా ఉండాలి .. 
అదేవిదంగా ప్రేమని ప్రేమించడం ప్రేమించ బడటం కూడా అంతే ...
చూపించగలిగేదే ఐతే చూపేలేని వాళ్లకి ప్రేమే దొరకదు కదా ... !!

Thursday, September 13, 2012

నాకేమీ తెలియటం లేదు ....
నీవున్నా నాకు లేవనే వినిపిస్తోంది ..
నాలో ఉన్న ప్రేమని మౌనంగా దాచుకొన్నా ....
నా హృదయం అద్దం వలె నీ ప్రతిబింబాన్ని చూపిస్తోంది ...
లేదనే నీ సమాధానం తో దాన్ని ముక్కలు చేస్తావా .... 
నా పై ప్రేమ లేదని నీకు చెపాలంటే ఒక క్షణం చాలు  ....
కాని నా ప్రేమను నిరూపించాలంటే నిండు నూరేల్లైనా చాలవే ..
నీ బదులు లేదు అని అంటే ...
నాకు మరో జన్మైనా కావాలి నీ దరి చేరేదాకా  .... !!





Wednesday, September 5, 2012

ఊ అంటే నిజమౌతా ....
కాదంటే కలనౌతా....
నిన్నలోనే నిలుచున్న జ్ఞాపకం కన్నా ...
నేటిలోని నిజం ని తలుచుకున్నా ..
కలలతోనే కాలయాపన చేసినా ...
నిజాల జాడలో నీవే అని మనసెరిగి మెలకువలో కలే నే చూసినా .....
కేవలం నీ ధ్యాసలో .... 
కేవలం నా మనసులో ..... !!