Wednesday, November 2, 2016

పరికిణి లో నిన్ను చూసిన  ఈ సమయాన ...
మెరుపై మెరిసెను నా  గుండె లో ఈ క్షణాన ....
అనిపిస్తోంది నా జీవిత నౌకకు తెరమాప నీవేనేమో అని ...
కలలోనా అని  అనుకున్నానా,
నా కనులు తెరిచిన  ఈ నిమిషాన !!!
 

Thursday, October 6, 2016

Most beautiful things happen in the dark ...

When the sun falls into sleep,
When the brighten stars gives little light around you...
When the the moon hidden in the dark clouds...

I can dream of you...
I can see a dream of your smile...
Life stays really beautiful even when you are covered in darkness...
Oh your smile ... A spark in my mind....
--- My dimple queen !!!

Monday, July 4, 2016

ఏమైంది ఈ లోకానికి ....
అమాయకంగా ఉన్నఅమ్మాయి,
వనంలో ఉన్న అందమైన లేడి పిల్లలా అయిపోతోంది ...
ఎక్కడచూసినా అవమానకర దృశ్యాలే ...
పుట్టినప్పటినుంచి భయపడుతోంది ...

కాపాడాల్సిన తండ్రిలాంటి వాడు కసాయిగా మారుతున్నాడు ...
అనుక్షణం అండగా ఉండాల్సిన వాడు అడుగడునా వెంటపడుతున్నాడు ...
ఆప్యాయంగా చూడాల్సిన కనులు కోరికతో  చూస్తున్నాయి ...
భరించలేక అరిస్తే ఆ గొంతుకను నులిమేస్తున్నాయి
అపుడే విరిసిన మొగ్గలూ అపుడే కాలిపోయే జీవితాలైపోతున్నాయి ...

ఎటుపోతోంది ఈ సమాజం ...
ఓర్పుకి మారుపేరనే మాటను నిజం చేస్తూ,
ఇలాంటి దారుణాలను తనలోనే దాచుకుంటున్న వారెందరో ...

ఎవరు ?
ఎవరు ఎవరు ?
ఎవరు - అసలు ఈ పరిస్థితి కి కారణం ఎవరు ?
ఎవరు - అని ఒకరిని ఒకరు ప్రశ్నిస్తే ?
సమాధానం లేని ప్రశ్ననేగా ...
ఒకరికి ఒకరుగా సమాజంలో తోడుండాల్సిన వారు అడవిలో మృగాలైపోతున్నారు ...
ఇలానే అయితే ఇది సమాజ పతనానికి నాందినిచ్చే ఊతం కాదా ??

ఆలోచించండి !!!!!!!!
ఎన్నో ఇంకా ఎన్నెన్నో ... ఇలా ఇంకెన్నో ....
రాస్తూ ఉంటే  ఇంకా ఎన్నో మది తలుపుల వెనుకాల దాగుతున్న బాధలేన్నో ....
ఏదో జరిగినప్పుడే ... అయ్యో అలా జరిగింది అనేకన్నా ...
జరిగేది ఆగాలి అంటే అది మనలో మార్పు వచినపుడే ...
అన్ని బంధాలకి, అనుబంధాలకి విలువిచ్చే నవ సమాజ నిర్మాణం కోసం
సమాజంలో వచ్చే మార్పు కోసం భారతావని దీనంగా ఎదురుచూస్తోంది .... !!!



అందరూ మాట్లాడినా ఏమనిపించలేదు ...
అవే నీవు మాట్లాడితే ఇంత కొత్తగా అనిపిస్తుందని ...

నాలోనే ఉన్న గుండెచప్పుడూ ఎపుడూ  ఇంత సందడి చేసేది కాదు ...
అది నీవు నా చెంత ఉన్నపుడు అర్థం అవుతోంది ....

నాలోనూ మనసుంటుందని ఎపుడూ అనిపించలేదు ...
నిను ప్రేమించడం మొదలు పెట్టేంత వరకు ...

ప్రేమే చిరకాలం అని ఎపుడూ అనిపించలేదు ....
నిన్ను వదిలి దూరంగా వదిలివస్తున్నపుడు అర్థం అవుతోంది

రోజూ నడిచే సమయాన్ని ఎపుడూ  పట్టించుకోలేదు ...
నీవు నను వదిలి వేలెపుడు అర్థం అవుతోంది ఎంత భారంగా కదులుతుందో అని ...

నా ప్రాణంకి ఆయుష్షు ఇంత అని ఎపుడూ  అనిపించలేదు ...
మనం మళ్ళీ కలిసేది మరు  జన్మ అని తెలిసేంత వరకు ..

మరుపు అనేది దేవుడిచ్చిన వరమంటారు ....
మరి నా విషయంలో అది శాపం అని నీవు గుర్తొస్తున్నపుడు అనిపిస్తోంది !!!




 

Thursday, March 17, 2016

ప్రేమ నాకొక వరం ....

నా ప్రేమకు నీవొక వరం ....

నా మనసుకు నీ ప్రేమ ఒక వరం ....

వేచిన సమయం వీడిపోయింది నీ రాకతో ....

నా మనసున కోలువైపోయావు నీ నవ్వుల రూపంతో ....

నా మాటే కరువైపోయింది నీ ముందు  ....

మనసుని అల్లుకున్న నీ ప్రేమ ఇక  విడిపోకుడదంటుంది ...

ఎపుడూ ... ఎన్నడూ ... కలిసుందామంటుంది ....

కాలం కరిగిపోని మన ప్రేమల అలజడిలో ...

లోకానికి మన ప్రేమని ఒక దృశ్య కావ్యంగా అందిదాం ....