Monday, November 17, 2014

నాలో నేనై ... నాతోనే నేనయ్యానుగా ...
నాకై నేనుగా, నా మనసులో ఉన్న ఊహలతో అంతర్యుద్ధం చేస్తున్నానుగా ...
మౌనంగా ఉన్న నా మనసులో అలజడిలా చేరి నా మది అనే కోవెలలో చేరిపోయావు ...
నా మనసులో ఉన్నది నువ్వే అయినా నీతో గెలవలేక ఓడిపోతున్నాను ...
నీకు చేపుకోలేక నిన్ను ఎందుకు అని అడగలేక మౌనంగా ఉన్నాను ....
నీకు నీ వారికి అండగా ఉండి రాకూడనివ్వకూడదు అనుకున్నాను ఏ కష్టం ...
విధి ఆడిన ఆటలో నను ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నావు ...
ఆలస్యంగా తెలిసింది నేను అనుకున్నవి అన్నీ కలలేనని ....
అందరికై జీవించి నాకై నేను జీవించలేక నాకే ఓ జ్ఞాపకమయ్యాను .....
నీవు నాలో లేని రేపటికోసం ఉండటం నా దృష్టిలో వ్యర్థం ...
బ్రతికినా నీవు లేవనే శోకం లో ఉండటం కష్టం ....
మనసులో నీ రూపానికి కోవెల కట్టినా అది రాతి గుండెనే తలపిస్తోంది ...
ఓడానో గెలిచానో తెలీదు కానీ నీవు లేని నా అంతరాత్మ అయింది నేటితోనే అంతం ... !!!

Wednesday, November 5, 2014

అమ్మాయి మనసు సముద్రంకన్నా లోతైనది ...
దూరo నుంచి చూస్తే ప్రశాంతంగానే కనిపిస్తుంది ... కానీ లోపల అంతులేని నిశబ్దం ...
నిశబ్దాన్ని అల్లరి చేస్తూ అలలా ఉంటుంది తన చిరునవ్వు ...
ఎటుచూసినా ఆ ఎగిసే అలలా తన నవ్వుల సవ్వడితో నిను మైమరిపిస్తుంది ....
సముద్రపు అల ఎంత ఎత్తు ఎగిసి తీరం వైపు పరుగు తీసినా ...
అదేదో నిను తాకేందుకే వస్తునట్టు ఉంటుంది ...
కానీ  నిజానికి ఆ అల ఆ తీరం దాటి రాలేదు ...
సంద్రంలోని నిశబ్దం బయటికి రాలేనట్టుగా ....
తన మనసులోని మాటలూ బయటికి రాలేవు  ..... !!!!

Monday, November 3, 2014

మొదటిసారి కలిసినపుడు అనిపించింది ....
ఇదే చివరిసారి అవ్వొద్దు అని ...

గుర్తుపెట్టుకున్నా మాట్లాడిన ప్రతి చిన్న మాటనీ ...
అది అంతగా ముఖ్యం కాకపోయినా అనిపించింది మరిచిపోవద్దు అని ...

రెండోసారి ... మూడోసారి ... ఇలా కలినన్ని సార్లు జ్ఞాపకంగా దాచుకున్నా ...
నీవు మాట్లాడిన ప్రతిచిన్న మాటనీ ...

రోజులు గడుస్తున్నా అనిపించింది ఇవాళ ఏం  మాట్లాడుతుందో అని ...
ఏదేదో మాట్లాడాలని అనుకున్నా నిన్ను చూసిన వేళ అంతా మరిచిపోతాను ....

కలిసిన సమయం కొంతే అని తెలిసి బాధపడినా ఆ కొంచెం సేపు అయినా దక్కినందుకు సంతోషించా ... 
సంతోషం బాధ అన్నీ మరిచిపోయాను తన ధ్యాసలోనే ...

వారానికి రెండే సెలవులైనా అనిపించేది తను చూడటం కుదరని ఈ వారంతం ఎందుకని ...
తను కనిపించని రోజులని లెక్కపెట్టా ... గంటలు .. నిమిషాలు .. ఆఖరికి క్షణాలు కూడా యుగాల్లా అనిపించాయి ...

యుగాల్లా అనిపించిన అదే క్షణాలు తను ముందుంటే ఆగేవి కావు ...
జీవితంలో ఏ  రోజు ఆనందంగా అనిపించింది అంటే అది నిన్ను కలిసిన ప్రతి రోజూ  అని చెప్తాను..

ప్రపంచమంతా ఒకవైపు నీవు నేను ఒకవైపు అనిపించేది ...
నీవు లేవు అని అనిపించినపుడల్లా అనిపిస్తుంది ప్రపంచం నీవు ఒకవైపు నేనొక్కడిని ఒకవైపు అని ....
నీవు లేని ఈ జీవితం ఊహించే కన్నా నీవు ఉన్నన్ని రోజులు అయినా ఆనందం చాలు అనిపిస్తుంది .... !!