Sunday, August 5, 2012

మనసుకి నచ్చిన వ్యక్తి మాట్లాడే ఒక్క నిముషం మాటల కోసం లక్షల నిముషాలు ఆనందంగా ఎదురు చూస్తున్నట్టు ....
క్షణమైనా తీరికనే ఉండని ఈ జీవితంలో ప్రతి క్షణం కోరికలున్నట్టు ....
క్షణమైనా వేచి ఉండని కరుణలేని సమయానికి తోడేవరు లేనట్టు ....
పోవద్దె ప్రాణమా అని ఎంత మొత్తుకున్నామరణం వస్తే ఆగనట్టు  ...
క్షణం, ప్రాణం ఆగకపోయినా ....
తిరిగిరాని కాలానికి, అలసిపోయే ప్రాణానికి  ...
మరువలేని మధుర జ్ఞాపకాలతో తిరిగి రప్పించే దేవుడిచ్చిన ఓ గొప్ప వరం .... స్నేహం ....
సూర్య కిరణానికి చీకటే  తెలియనట్టు ...
జీవన పద్మవ్యూహంలో దారులు చూపే దివ్య కిరణం లాంటి స్నేహానికి అడ్డేమి .....
వెలుగు జిలుగుల లోకానికి మారు రూపమయిన ఓ స్నేహ బంధమా  .....
ఆనందానికి చిరునామా ...
ఔన్నత్యం కోరే ఓ గొప్ప బంధమా...
విడిపోని నీడలా తోడుండేది  ...
సమస్యలలో భుజం తట్టేది ....
సమస్త కాలంలో మన వెంటుడేది ...
చిరస్తాయిగా నిలిచే విలువైన మాధుర్య బంధం ...
కల్మషం లేని స్నేహంతో జీవితమంతా పూలబాటే కదా ..... !!







Saturday, August 4, 2012

నీవు చూసే చూపు కోసం కనులు తెరిచిన నా మనసు ....
నా లోలోపల నీకై  పరుగులు తీసేది ...
అలసిపోయాను ...
నను నేను  మైమరిచిపోయాను ...
నాలో మైమరిచిన  నీ రూపు జాడే తెలియక తికమక పడిపోయాను ...
నీవు ఎపుడైనా నా దరికి వస్తావని ఇలా ఒంటరిగా ఈ దరిలో నీకోసం వేచి ఉన్నాను ....