Sunday, September 25, 2011



అక్షరాలతో సహవాసం..ఎంత అదృష్టమో కదా !
నీవు దూరం అయితే నాకు మిగిలింది ఇదేకదా
మాటలతో చెలిమి..
దూరం అయినప్పుడు వచ్చిన ఆలోచనలే ఇవి..
మనసును ఆవిష్కరించే కుంచె కదా !
అందుకే..గొప్ప కోసం వ్రాయడం లేదు
ఎవరి మెప్పు కోసమూ వ్రాయడం లేదు
ఆలోచన నన్ను నిలువనీయనపుడూ
సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
నీజ్ఞాపకాలు గుండెల్ని 
తాకినప్పుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా,
ఇలా రాస్తున్నది అని నీకు కూడా తెలుసు కాని...?

పదాల పొదుపూ ,పొందికా కుదురుతుంది .
ఆత్మ తృప్తి కొఱకు , ఆనందం పంచటానికి కాదు
ఆవేదన పంచుకోవటానికి
రాయడం లేదు...మనసు చంపుకొని రాస్తున్నా..
నీతో మాటలు పంచుకోలేనప్పుడు ..ఇలా చేస్తున్నా..ప్రియా..
నన్ను నేను గా కొల్పోయిన క్ష
ణంలో ఏంచేయాలో తెలీక ఇలా చేస్తున్నా .. !!



Sunday, September 11, 2011

కళ్ళలో వెన్నెల వెలుగులతో ..
పెదవులపై నవ్వుల పువ్వులతో ..
ఎదలో ఊసుల సవ్వడితో ..
మదిలో మాయని బాసలతో .. 
గుండెల్లో పొంగే ప్రేమతో ..
హృదయంలో తరగని తలపులతో ..
నాకోసం నడిచొచ్చే తరుణంకై  ..
వేచి ఉన్నా వేయి కన్నులతో నీకై ..
ఓ ప్రియా..
నేను ఒక ప్రశ్న లాగే మిగిలి పోతానేమో ..
అయినా కూడా
నీలో సమాధానం పొందే వరకు
వెతుకుతూనే ఉంటాను ..
ఎందుకో తెలుసా.. 
నా ప్రశ్నకు  సమాధానం నీవే కదా మరి .. !!




















Sunday, September 4, 2011

గురువులకు పాదాభివందనం ..
మీరు ప్రసాదించే జీవితం నందనం ..
మీరు అందుకోండి మా అభివందనం ..
ఆరాధించాలి మేము మిమ్మేన్నడు ..
ఆశీర్వదించాలి మీరు మమ్మేన్నడు.. 


నాకు చదువు చెప్పిన ప్రతి ఒక్క ఉపాద్యాయునికి పేరు పేరున పాదాభివందనాలు
లోకంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కృతజ్ఞాతాభివందనాలు  .. !!