Thursday, February 13, 2014

నా హృదయం లో దాచుకున్న అందమైన నీ ప్రతి రూపాన్ని .... 
నా మనసంతా ఆవహించిన అంతులేని ఆ ఊహల పరిమళాన్ని ..... 
నా కన్నులలో దాచుకున్న నీ చిరునవ్వుల చిరునామాల్ని .... 
నా కనురెప్పలపై నింపుకున్న నీ నవ్వుల ఊహా రేఖల పరిచయాన్ని ... 
నీ విరబూసిన బుగ్గలలో వదిలేసుకున్నా నా బిడియాన్ని .... 
నింపుకున్నా నా ఊహలలో నిండైన  ఆ వెన్నెల్లో తెరతీసిన నీ మోము రూపు రేఖల్ని.... 
అణువణువునా దాచుకున్న నీ బిడియపు అంచుల అందాలన్నీ .... 
నిద్దుర పోని నా భావాలపై అద్దుతున్నా నీ ఆశల అంచులన్నీ ..... 
చెప్పలేక, చూడకుండా ఉండలేక అల్లుతున్న ఈ మాటల పూదోటలన్నీ ..... 
మొన్నలేని భావాలెన్నో నిన్ననీ రాకతో మెలుకువ వచ్చినట్టుగా .... 
మాటరాని మౌనమేదో నా పెదాలపై ఒదిగిపోయినట్టుగా .... 
ఈ క్షణం లో ఆరాధనగా ఉన్నా మరు క్షణం లో ఆవేదనగా మిగిలినా ... 
ఆ ఒక్క క్షణమైనా నా మనసు పడే ఆనందమే నాకు మిగిలిపోదా కలకాలం .... 
ఒక్కొక్క క్షణమంతా కలగలసి ఈ జీవితమంతా ఉండిపోదా నీ తలుపులతో ..... 
ఈ ఒక్క క్షణం గురించి నీకు తెలపనా ప్రియా .... మరల తెలుపనా .... ప్రియా ..... !!!!

ప్రేమ తో .... 

నీకు 
ఈ ప్రేమికుల రోజున .... 


Friday, January 17, 2014

ఎదురొచ్చే కష్టాలని చూసి కంగారు పడకుండా ... 
చిరునవ్వుతో ఎదురెలితే ఆ కష్టాలే కాస్త కంగారు పడతాయి ... 
దేవుడు మనిషిని పుట్టించింది కష్ట సుఖాల తూకం చూడానికే అని తెలుసుకో .. 
ఎందుకంటే మనిషిలో కూడా దేవుడు ఉంటాడు అనే నిజం తెలుసుకో .. 
అందుకే కదా ప్రతి మనిషి ఒకరినొకరు గౌరవించమని చెపేది .. 
ఆ నిజాన్ని తెలుసుకున్నారు కాబట్టే
మదర్ థెరిస్సా ఒక దైవం లా అందరికీ  ఆదర్శం అయింది ... 
వివేకానందుడి మాట ప్రపంచమంతా వింది ... 



Sunday, December 22, 2013

నీ నవ్వందాన్ని ఇలా నీ పరికిణిలో దాచితే ..
ఇంకా అందంగా అందరినీ  మైమరిపించదా ... 

Sunday, December 15, 2013

నవ్వడం ఒక యోగం ...
నవ్వలేక పోవడం ఒక రోగం ..
అందుకే అంటారు నవ్వు అది దేవుడిచ్చిన గొప్ప వరం అని ...
ఇక అమ్మాయి నవ్వితే ... అది అచ్చ తెలుగు అమ్మాయి నవ్వితే .... దేవుడిచ్చిన వరానికి 1+1 ఆఫర్ ....
వీల్లిద్దరిలా ... 

Saturday, December 14, 2013

కన్నీలని ఆపుతున్నా .. ఆ కన్నీలలో నీ రూపం చేరిగిపోకూడదని ... 
మనసులో భావాలని రాస్తున్నా, నిను చూస్తూ .. 
మౌనం గా వేచిఉన్నా ... 
నీవు రావద్దంటున్నా వినట్లేదు .. 
పరుగేత్తే ఈ కాలంలో కడవరకు వేచి ఉంటా .. !!

Tuesday, July 23, 2013

© Copy right 2013 Srinivas Samala., All Rights Reserved.

ఆడదాని కోసం కొట్టుకుంటే అది రామాయణం అన్నారు ...
ఆడది నవ్విందని కొట్టుకుంటే మహా భారతం అన్నారు ....
ఆడది ఏడ్చిందని కొట్టుకుంటే పలనాటి యుద్ధం అన్నారు ...
దీన్ని బట్టి అర్థం ఏమైంది ....
ఈ ఆడవాళ్ళు నవ్వితే నాశనం ...
పలకరిస్తే ప్రళయం ...
ఏడిస్తే అబ్బో అదో విద్వంసం ....

బలమైన మగాడిని ఏమైనా చేయొచ్చు ...
కాని అమ్మాయిని మాత్రం ఏమి చేయలేం ....

ఫైనల్ గా చెపేది ఏందంటే ...

ఆడవాళ్ళని ఎపుడు ఏడిపించకండి ....

Respect woman and save the world ... :P

~ Key Source : Aarudra's Novel.
Modified to apply for current scenerio's in India and next GEN .. :D
ఆడదాని కోసం కొట్టుకుంటే అది రామాయణం అన్నారు ...
ఆడది నవ్విందని కొట్టుకుంటే మహా భారతం అన్నారు ....
ఆడది ఏడ్చిందని కొట్టుకుంటే పలనాటి యుద్ధం అన్నారు ...
దీన్ని బట్టి అర్థం ఏమైంది ....
ఈ ఆడవాళ్ళు నవ్వితే నాశనం ...
పలకరిస్తే ప్రళయం ...
ఏడిస్తే అబ్బో అదో విద్వంసం ....

బలమైన మగాడిని ఏమైనా చేయొచ్చు ...
కాని అమ్మాయిని మాత్రం ఏమి చేయలేం ....

ఫైనల్ గా చెపేది ఏందంటే ...

ఆడవాళ్ళని ఎపుడు ఏడిపించకండి ....