కాని చెలి తలుపులు తట్టందే ఆ తలుపులు తెరుచుకోవట .. !!
Monday, January 23, 2012
లక్ష్యం ఒకటే.. కాని దారులు వేరే..
బాపూజీతో బంధం తెంపుకుని సొంత సైన్యానికి దళపతి అయాడు ..
'అదృశ్య' ధర్మాగ్రహమై ..
మూడు రంగుల మధ్య ధర్మ చక్రమై ..
గణతంత్రాన్నినడిపిస్తున్న,
యువతరానికి దూకుడు మంత్రం నేర్పించిన స్పూర్తి ప్రదాత సుభాష్ చంద్ర బోస్..
ఆయన జయంతి న ఒకసారి స్మరించుకుందాం..
Sunday, January 15, 2012
కనులకు కలలందం ..
నీ మోముకు నవ్వందం ..
పాటకు పల్లవి అందం ...
ఆ పాటకు నీ స్వరం అందం ..
Friday, January 13, 2012
భాగ్యాలని ఇచ్చే భోగి ...
సరదానిచ్చే సంక్రాంతి .....
పండుగకే కలనిచ్చే కనుమలోగిల్లి ..
కొత్త సంవత్సరంలో సరికొత్తగా కొత్త వెలుగులు నింపాలని ....
అందరికి ఆనందాన్ని పంచాలని ..
మనస్పూర్తిగా కోరుకుంటూ .. సంక్రాంతి శుభాకాంక్షలు ..
-- శ్రీనివాస్ సామల
Thursday, December 8, 2011
ఎప్పుడు మొదలైనా ..
ఎలా మొదలైనా ..
మొదలైన పరిచయం..
మనసుని తాకితే అదే స్నేహం..
కలిసిన స్నేహం కలకాలం కొనసాగితే ..
నడిచే దారంతా అవదా పూలవనం ..
Monday, November 28, 2011
తీరాన్ని తాకగానే ఇక ఉంటా అని పరుగెత్తే అల ..
సాయం మబ్బుల్లో దాగి నాకిక సెలవనే సూరీడు..
అరే నేనున్నానంటూ చల్లని వెన్నెల పంచే చంద్రుడు..
ఓహ్ .. అన్ని వేళలా ఉండటం వీటి వల్లా కాదుగా ..
నీ స్నేహం తో మనసంతా విరబూయదా..
మనసంతా విరిస్తే ఆ మబ్బులనే తాకవా నా కలలు..
ఆ కలలు సాకారం కావా నీ స్నేహం విరబూయగానే ..
దివి లోని స్వర్గం ఈ దరి చేరదా..
స్వార్థం లేని ప్రేమని మించిన ఈ లోకాన ..
తరగని ఈ స్నేహం విలువ ఏ సిరి తో సరితూగదు కదా .,
అందుకే చెప్తున్నా ..
స్నేహమే కదా కడవరకు నిలిచేది .. దానికి సరి లేదు కదా ఈ లోకాన..
చేసే ఈ స్నేహాన్ని .. మరువకు ఏనాడు .. మరింతగా కొనసాగాలి సాగే కాలంతో పాటుగా . ... !!
Friday, November 25, 2011
వర్షం రాబోయే ముందు ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి, వర్షం వచ్చి వెళ్ళిపోగానే ఆకాశమంతా ప్రశాంతంగా స్వచ్చంగా మారిపోతుంది, అదేవిధంగా జీవితంలో కూడా వర్షించే మేఘాలు కమ్ముకున్నప్పుడు కన్నీరు వర్షంలా కురుస్తుంది. కాని అదే సమయంలో నీ చిరునవ్వు తెల్లవారిన స్వాతికిరణం లాగా వెలుగుతున్నప్పుడు మబ్బు నిన్ను చూసి తలవంచుకుంటుంది.
కావున నా నేస్తమా నీ అధరాల నుంచి చిరునవ్వుని ఎన్నడు దూరం కానివ్వకు... నీ నవ్వుని చూసి నాలాంటి ఎందరో ప్రాణస్నేహితులకు అమృత వర్శమవుతుంది... నీ చిరునవ్వుని నీ ఆదరాల ఫై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాక్షించే.... నీ నేస్తం.. !!