ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలంటారు ...
అదే ప్రేమ మరిచిపోవాలంటే ఒక జీవితం కావాలి ...
నా జీవితంలో నీపై పుట్టిన ప్రేమను మరిచిపోలేను ...
ఈ జీవితంలో నా మనసులో నీవే ఉంటావు ...
అందుకే అంటారేమో ప్రేమ పెరగటమే ఉంటుంది
కాని అది ఆగిపోవడం అంటే ఇక జీవితం మిగిలి ఉండదు అనీ ....
నీకై వేచి ఉండటం లో ఉన్న ఆనందం చెప్పలేను ....
అందుకే నీవు వస్తునావని తెలిసిన మరుక్షణం నీకై వేచి ఉన్నాను ఆనందంగా ...
అందమైనవి ఆ క్షణాలు .. అందుకోలేని దూరాలైపోతున్నాయి ...
నీవున్న ప్రతి క్షణం నా ఆనందానికి అవదుల్లేవు ...
మరిచిపోలేని ఆ తీపి గుర్తులకు నా అక్షర రూపం ఇస్తున్నా ...
నీవు మాట్లాడిన ప్రతి మాట నా మదిలో నిలిచిపోయాయి ...
నీవు చేసిన ప్రతి చిన్న పని నా కళ్ళెదుట కనిపిస్తోంది ...
నిను చూస్తానన్న ఆనందం ఎంత దూరాన్నైనా దగ్గర చేస్తాయి ....
నీ పై ప్రేమకి వీడుకోలు చెప్పలేక ...
నీ జ్ఞాపకాలకి అక్షరాలద్దుతున్నా నా కళ్ళ నిండా కమ్మిన కన్నీటి మబ్బులతో ...
నీ మాట విన్నా ... నీ చిరునవ్వుని చూసా ...
నీవు లేని నా ప్రయాణం ని ఊహించ లేకున్నా ...
నీవు లేని క్షణమొక నరకమని తెలిసినా వెళిపోతున్నా ...
జీవితం చివరంచుల వరకి నీ పేరే నా మదిన రాసుకున్నా ...
నీ ప్రేమ నా మనసుకి గాలి లాంటిందని నీకు ఎలా చెప్పను ...
కలిసుండటానికి నీవు కారణాలు వెతికావు ....
విడిపోడానికి వాదనలూ వాడుతున్నావు ...
కలిసిరాని ఈ కాలానికి తలవంచి వెళిపోతున్నా ...
నా ప్రేమకి ముగింపు నీవే అయినపుడు ..
నీవు లేని ఈ జీవితంకి మరుజన్మతో ముగింపు ఉంటుందని అనుకుంటున్నా ...
అసలు నిజమైన ప్రేమకి ముగింపే లేదు ... ముగింపే ఉంటే అది నిజమైన ప్రేమ ఔతుందనుకోను ...
నిను విడిచిన ఈ మరుక్షణం ..
ప్రతి క్షణం నీ జ్ఞాపకం గడియారపు ముల్లులా నిను గుర్తు చేస్తూనే ఉంటుంది ...
ఇపుడు నా మనసు ఓడిపోయుండొచ్చు ...
అసలు ఇపుడు నా ప్రేమ నీకు కనిపించకపోవచ్చు ...
జీవితంలో ఎపుడైనా నీ పిలుపు కోసం వేచి ఉంటానని మరువకు ...
కలకాలం నీతో కలిసుండాలనుకున్నాను ...
నీ స్నేహం లేని నా ప్రాణం ఉన్నా లేదనేది మాత్రం వాస్తవ సత్యం ... !!!