కురిసే ఈ చిన్ని చిన్ని చినుకుల్లో
మైమరిపించే స్వాతి ముత్యమల్లె నీ నవ్వులతో
నా గుండెని ఇలా ఆనందంతో తడి పేసావు ...
ఎన్నో ఎన్నో ఆశలతో పెంచానమ్మా నా గుండెలో ఈ పూదోటా ....
అలుపెరుగని నా కలలన్నీ నీ కన్నుల్లో కొనసాగించాలమ్మా ....
చిత్రంగా ఉంది నీ మీద ఉన్న నా ప్రేమని చూస్తుంటే ....
అందుకే నా మాటలతో రాస్తున్నా నా ఈ మాటల పూదోటని ....
నీకు చేరుతుందో లేదో అని మీమాంస లో కన్నా నా కోసం వస్తావని ....
నా మనసులో ప్రేమ నీ మనసుని తాకే ఆత్రుతతో వేచి చూస్తున్నా ...
కొంచెం కోపం ...
కొంచెం పొగరు ...
కొంచెం అలక ...
కొంచెం నవ్వు ....
అన్నీ కలగలపి చేస్తున్నాయి నా ప్రేమని స్వచ్చంగా .....
మరి జీవితం చాలా చాలా చిన్నది అయిపోతుంది ...
చేరుస్తావో నా చుక్కాని లాంటి ముద్ద మందారం .... :