Thursday, February 13, 2014

నా హృదయం లో దాచుకున్న అందమైన నీ ప్రతి రూపాన్ని .... 
నా మనసంతా ఆవహించిన అంతులేని ఆ ఊహల పరిమళాన్ని ..... 
నా కన్నులలో దాచుకున్న నీ చిరునవ్వుల చిరునామాల్ని .... 
నా కనురెప్పలపై నింపుకున్న నీ నవ్వుల ఊహా రేఖల పరిచయాన్ని ... 
నీ విరబూసిన బుగ్గలలో వదిలేసుకున్నా నా బిడియాన్ని .... 
నింపుకున్నా నా ఊహలలో నిండైన  ఆ వెన్నెల్లో తెరతీసిన నీ మోము రూపు రేఖల్ని.... 
అణువణువునా దాచుకున్న నీ బిడియపు అంచుల అందాలన్నీ .... 
నిద్దుర పోని నా భావాలపై అద్దుతున్నా నీ ఆశల అంచులన్నీ ..... 
చెప్పలేక, చూడకుండా ఉండలేక అల్లుతున్న ఈ మాటల పూదోటలన్నీ ..... 
మొన్నలేని భావాలెన్నో నిన్ననీ రాకతో మెలుకువ వచ్చినట్టుగా .... 
మాటరాని మౌనమేదో నా పెదాలపై ఒదిగిపోయినట్టుగా .... 
ఈ క్షణం లో ఆరాధనగా ఉన్నా మరు క్షణం లో ఆవేదనగా మిగిలినా ... 
ఆ ఒక్క క్షణమైనా నా మనసు పడే ఆనందమే నాకు మిగిలిపోదా కలకాలం .... 
ఒక్కొక్క క్షణమంతా కలగలసి ఈ జీవితమంతా ఉండిపోదా నీ తలుపులతో ..... 
ఈ ఒక్క క్షణం గురించి నీకు తెలపనా ప్రియా .... మరల తెలుపనా .... ప్రియా ..... !!!!

ప్రేమ తో .... 

నీకు 
ఈ ప్రేమికుల రోజున ....