Wednesday, June 19, 2013

మరిచిపోగాలమా ఈ కనులముందున్న నిలువెత్తు రూపం ...
తప్పు చేసినా సైలెంట్ గా మరిచిపోయే ఆ మంచి మనసు ... (వాడే తప్పు చేస్తేలే)
సాయం అడిగితే అడిగిందే తడువుగా తడుముకోకుండా చేయూత నిచ్చే నిబ్బరం ... (ముందు మొహం చూసి వచ్చి రాని తిట్లని మనసులో మనసారా తిట్టుకుంటా డనుకో )
ఎలా మరువగలం ... (మరిచిపోతే కూడా ఏమైనా అప్పున్నావ అని అయినా అడుగుతాడు )
ల..  లా .... ల ... లా......
ఆ తోడు మన వెంటే ...
నీ నీడైనా  నేనే అంటాడు ....
కను చూపులతో చంపలేడు కాని కను సైగ లతో కహానీ లే నడపగలడు ....
అందే ఎత్తులో ఉన్నా అందరి అంచనాలకందని మొనగాడని వేరే చెప్పాలా ...
అయినా ...
వీడే .. అవును వీడే .... నాకున్న అందరి లో నిజమైన స్నేహితుడు ....
అందుకే వీడి మీద నాకున్నది కోపం కాదు పిచ్చి ప్రేమ .....
నిజంగా దేవుడే ఉంటే ...
కలకాలం సాగేలా మా స్నేహ బంధాన్ని అందరూ ఈర్ష పడేలా ఉండాలి అనుకుంటా ...


Tuesday, June 18, 2013

అసలు నాకు ఏమైందో అర్థం అవటం లేదు ....
నను ఈ దరికి చేర్చిన నీ ఆలోచనలన్నీ అలా జారిపోతున్నాయి ....
నాకోసం నను వెతికేలా చేస్తున్నాయి ....
మరిచిన నిను నా మనసు లోతుల్లో నుంచి తీయలేని నిజాన్ని నమ్మలేక పోతున్నాను ...
అటు ఇటు వెతుకుతూ ఎదురొచ్చే ఈ కాలాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి ....
ఒక్క నిమిషం నీవు లేవని తల్లడిల్లే నా మనసుకి అసలు ఏమైందో అర్థం అవటం లేదు ...
నీవు ఇపుడు నా చెంత లేవని తెలిసినా అలా అనిపించడం లేదు .....
తెలిసిన ఈ నిజం మరుజన్మలో నీ రాకతో తీరుతుంది అని తెలిసినా నమ్మటం లేదు ...
కరడు కట్టిన ఈ కాలం మాయలో అసలు నాకు ఏమైందో అర్థం అవటం లేదు
నను ఒంటరిగా విడిచి నా నుంచి చేజారిన నీ నవ్వు లే ఎదురవ్వాలేమో
నాకేం అయిందో తెలియాలి అంటే ..... !!